తెలుగు సినిమా పరిశ్రమలోకి ప్రతి సంవత్సరం అనేక మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో కొంత మంది మాత్రం మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాలను అందుకొని సూపర్ క్రేజ్ ను కూడా సంపాదించుకుంటున్నారు. ఇక అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీతోనే మంచి విజయాన్ని , సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న అతి కొద్ది మంది ముద్దుగుమ్మలలో మెహరీన్ ఒకరు. ఈ బ్యూటీ నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి ఈ మూవీ తో మంచి విజయాన్ని , మంచి గుర్తింపును దక్కించుకుంది.

దానితో ఈమెకు వరుస పెట్టి తెలుగు సినిమాల్లో అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె నటించిన చాలా సినిమాలు మంచి విజయాలు సాధిస్తూ వెళ్లడంతో తక్కువ సమయం లోనే ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన స్థాయికి చేరుకుంది. ఇలా కెరియర్ ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్న సమయం లోనే ఈమె హరియాణాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి మనవడితో ప్రేమలో పడింది. ఇక ఇరు వర్గాల పెద్దలను ఒప్పించి వీరు పెళ్లికి కూడా రెడీ అయ్యారు. కానీ చివరి నిమిషంలో ఏమైందో ఏమో తెలియదు కానీ వీరి పెళ్లి ఆగిపోయింది. ఇక ఆ తర్వాత మళ్లీ ఈ బ్యూటీ సినిమాల్లో నటించడానికి రెడీ అయింది. కానీ ప్రస్తుతం మాత్రం మెహరీన్ కెరియర్ గొప్ప స్థాయిలో సాగడం లేదు.

ఈ ముద్దు గుమ్మ కొంత కాలం క్రితం ఎఫ్ 3 అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఎఫ్ 2 మూవీ లో కూడా ఈ బ్యూటీ హీరోయిన్గా నటించింది. కానీ ఎఫ్ 2 సాధించిన స్థాయి విజయాన్ని ఎఫ్ 3 మూవీ సాధించలేకపోయింది. ఇకపోతే ఎఫ్ 2 , ఎఫ్ 3 మూవీలలో వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా నటించగా. .. తమన్నా , మేహరిన్  హీరోయిన్లుగా నటించారు. అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: