టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఈయన చాలా సంవత్సరాల క్రితం నిర్మాతగా కెరియర్ ను మొదలు పెట్టి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలను నిర్మించి అందులో ఎన్నో మూవీలతో అద్భుతమైన విజయాలను అందుకొని ఇప్పటికి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ కలిగిన నిర్మాతలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే దిల్ రాజు కొంత కాలం క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ పాన్ మూవీ ని నిర్మించిన విషయం మన అందరికీ తెలిసిందే.

భారీ అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే ఈ మూవీ ద్వారా దిల్ రాజు కు భారీ మొత్తంలో నష్టాలు కూడా వచ్చినట్లు అనేక మంది అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే తమిళ దర్శకుడు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు "గేమ్ చేంజర్" మూవీ ని నిర్మించి పెద్ద మొత్తంలో నష్టపోయాడు అని వార్తలు వస్తున్నా సమయం లోనే ఈయన మరో తమిళ దర్శకుడితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... అల్లు అర్జున్ హీరో గా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో మరికొన్ని రోజుల్లో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక వేళ నిజం గానే అల్లు అర్జున్ , అట్లీ కాంబోలో రూపొందబోయే సినిమాను దిల్ రాజు నిర్మించినట్లయితే ఇప్పటికే తమిళ దర్శకుడిని నమ్మి పెద్ద మొత్తంలో నష్టాలను ఎదుర్కొన్న దిల్ రాజు ఈసారైనా తమిళ దర్శకుడి ద్వారా ఎలాంటి సక్సెస్ను అందుకుంటాడో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: