టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన సంగీత దర్శకులలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు సంగీతం అందించి శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇకపోతే తన సంగీతం తోనే దేవి శ్రీ ప్రసాద్ కొన్ని సినిమాలను విజయం తీరం వైపు తీసుకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే దేవి శ్రీ ప్రసాద్ కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాలకు కూడా సంగీతం అందించాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఆయన కొన్ని విషయాలలో నేను కచ్చితంగా ఉన్నట్లు , ఆ విషయాలకు మించి ఏదైనా సినిమా ఆఫర్ వచ్చిన దానిని వదిలేస్తాను అని చెబుతూ ... ఉదాహరణకు ఒక విషయాన్ని కూడా చెప్పుకొచ్చాడు. దేవి శ్రీ ప్రసాద్ తాజా ఇంటర్వ్యూ లో బాగంగా మాట్లాడుతూ ... వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన గద్దల కొండ గణేష్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా మొదట నన్నే అనుకున్నారు. కానీ ఆ సినిమాలో ఒక రీమిక్ సాంగ్ ను అనుకున్నారు. నేను ఇప్పటి వరకు ఏ సినిమాలో రీమిక్ సాంగ్ చేయలేదు. అలాగే రాబోయే రోజుల్లో కూడా నేను ఏ రీమేక్ సాంగ్ కి కూడా పని చేయాలి అనుకోవడం లేదు. ఇక ఆ విషయం హరీష్ శంకర్ కి తెలిసింది.

దానితో ఆయన మీరు అనుకున్న విషయంలో మీరు కచ్చితంగా ఉండండి. నేను ఈ సినిమాకు వేరే సంగీత దర్శకుడుని తీసుకుంటాను అని చెప్పి వేరే సంగీత దర్శకుడిని తీసుకున్నాడు అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే దేవి శ్రీ ప్రసాద్ తాజాగా పుష్ప 2 , తండెల్ సినిమాలకు సంగీతం అందించాడు. ఈ రెండు సినిమాలలోని సంగీతానికి కూడా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దేవి శ్రీ ప్రసాద్ కి దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Dsp