టాలీవుడ్ నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన చాలా సంవత్సరాల క్రితం కెరియర్ను మొదలు పెట్టాడు. కెరియర్ ప్రారంభంలో ఈయన సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో , విలన్ పాత్రలో నటిస్తూ వచ్చాడు. ఆ తర్వాత సినిమాల్లో హీరోగా నటించాడు. హీరోగా కూడా ఈయన నటించిన కొన్ని సినిమాలు మంచి విజయాలను సాధించడంతో ఈయన మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే కొన్ని సంవత్సరాల పాటు ఈయన సినిమాలకు దూరంగా ఉన్నాడు.

అలా సినిమాలకు చాలా కాలం దూరంగా ఉన్న ఈయన కొంత కాలం క్రితం తెలుగు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు బిగ్ బాస్ ద్వారా ఈయన మళ్ళీ ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు. కొంతకాలం క్రితం ఈయన ప్రధాన పాత్రలో రూపొందిన 90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. దీని ద్వారా శివాజీ కి మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే తాజాగా ప్రియదర్శి హీరోగా నాచురల్ స్టార్ నాని కోర్టు అనే మూవీ ని రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఇందులో శివాజీ విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ ద్వారా ఈయనకు అద్భుతమైన ప్రశంసలు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి దక్కుతున్నాయి. ఇకపోతే తాజాగా శివాజీ ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ , బోయపాటి శ్రీను గురించి ఈయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా శివాజీ మాట్లాడుతూ ... త్రివిక్రమ్ శ్రీనివాస్ గొప్ప రైటర్. ఆయన అద్భుతమైన కామెడీ సన్నివేశాలను రాయగలడు ... తీయగలడు. ఆయన అందరికీ నచ్చిన డైరెక్టర్ అని చెప్పాడు. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వం అంటే తనకు ఎంతో ఇష్టం అని , ఆయన తన ఫేవరెట్ డైరెక్టర్ అని శివాజీ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: