దాదాపు 170కి పైగా సినిమాలకు మ్యూజిక్ అందించి సౌత్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న తమన్ తన జీవితంలో ఎన్నో కన్నీటి కష్టాలు అనుభవించారట. ముఖ్యంగా 11 ఏళ్ల వయసులో తండ్రి చనిపోవడంతో చిన్నతనం నుండే బాధ్యతలు భుజాన వేసుకున్నాను అంటూ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో తన బాధలు చెప్పుకున్నారు తమన్. ఆయన మాట్లాడుతూ.. మా నాన్న నాకు 11 ఏళ్ళ వయసున్నప్పుడే మరణించారు. ఆయన్ని అంబులెన్స్ లో తీసుకొచ్చిన సమయంలో నా కంట్లో ఒక్క కన్నీటి చుక్క కూడా రాలేదు. ఆ టైంలో ఇంత చిన్న ఏజ్ లో మా చెల్లిని అమ్మ ను ఎలా చూసుకోవాలనే ఆలోచనే నాలో ఉంది.. ఆ తర్వాత మా ఇంటికి శివమణి గారు వచ్చినప్పుడు బోరున ఏడ్చేశాను. ఇక నాన్నకు వచ్చిన ఎల్ఐసి డబ్బులు అమ్మ నా చేతిలో పెట్టింది.

ఎంతో నమ్మకంతో నా చేతిలో పెట్టిన డబ్బును వృధా చేయకుండా సంగీత పరికరాలను కొనుక్కొని సంగీతం పూర్తిగా నేర్చుకున్నాను.ఇక నేను బాలకృష్ణ గారు నటించిన భైరవద్వీపం సినిమాకి కేవలం 11 ఏళ్ల వయసులోనే డ్రమ్స్ వాయించాను. ఆ టైంలో నాకు డ్రమ్స్ వాయించినందుకు 30 రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారు. మ్యూజిక్ మీద ఉన్న ఇష్టంతో మ్యూజిక్ నేర్చుకున్నాక ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నాకు సహాయం చేశారు.ముఖ్యంగా ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం గారు,శివమణి గారు నాకు సాయం చేశారు.ఇక ప్రస్తుతం నేను ఇండస్ట్రీలో మంచి పొజిషన్ లోకి వచ్చాను. 74 ఏళ్ల వయసులో ఉన్న మా అమ్మని కాలు కింద పెట్టుకోకుండా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాను. అంత చిన్న వయసులో మా ఫ్యామిలీ బాధ్యతలను మోయడంలో ఆ పరిణితి నాలో ఎలా వచ్చిందో తెలియదు. ఇక నేను మ్యూజిక్ అందించిన చాలా సినిమాలు ఎన్నో హిట్స్ అయ్యాయి.

 ఇక రీసెంట్గా వచ్చిన గేమ్ ఛజర్ సినిమా లోని పాటలు ఎక్కువ వ్యూస్ అందుకోకపోవడానికి కారణం ఆ పాటల్లో ఒక్క హుక్ స్టెప్ కూడా లేదు. అల వైకుంఠపురం సినిమాలో  హుక్ స్టెప్స్ ఉండడం వల్ల ఆ మూవీలోని పాటలు భారీ హిట్ కొట్టాయి.ముఖ్యంగా బుట్ట బొమ్మ పాట 900 మిలియన్స్ కి పైగా వ్యూస్ తో యూట్యూబ్లో సంచలనం సృష్టించింది. ఇక పాటలకు మిలియన్ వ్యూస్ రావాలనే ఉద్దేశంతో నేను మ్యూజిక్ అందించను. కేవలం మంచి మ్యూజిక్ అందివ్వాలనే ఉద్దేశమే నాలో ఉంటుంది. నేను ఇప్పటివరకు అందించిన మ్యూజిక్ లో అరవింద సమేత మూవీ లోని పెనిమిటి అనే సాంగ్ కోసం చాలా కష్టపడ్డాను. అలాగే నాగచైతన్య సమంతల మజిలీ మూవీకి కేవలం వారం రోజుల్లోనే మ్యూజిక్ అందించాను అంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన తండ్రి మరణం గురించి తన మ్యూజిక్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: