
ముఖ్యంగా తెలుగు నటుడు పాస్పోర్ట్ ను ఉపయోగించి బంగారాన్ని తప్పుడు విధానంలో రవాణా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. ఆ నటుడు పేరు తరుణ్ రాజ్ కొండూరు.. దీంతో ఈ విషయాన్ని తెలిసిన పోలీసులు వెంటనే ఈ నటుడిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. రన్యా రావు వెనక కింగ్ పిన్ గా తరుణ్ రాజు ఉన్నట్లుగా అధికారులు గుర్తించినట్లు తెలియజేశారు. ఆయన ద్వారానే ఇమే ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా రోజుకోక మలుపు రన్యా రావు కేసులో వినిపిస్తూ ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఈమెను విమానాశ్రయంలో అరెస్టు చేసిన తర్వాత ఆమె నివాసానికి వెళ్లగా అక్కడ రెండు దుబాయ్ కష్టమ్ డిక్లరేషన్ పత్రాలు కూడా లభించాయట. ఇటీవలే ఈమె భర్త కూడా వివాహమైన నెలరోజుల తర్వాత ఇద్దరము దూరంగానే ఉన్నామని తెలియజేశారు.. ముఖ్యంగా ఈమె తండ్రి కూడా ఒక అధికారి కావడం చేత అధికారులకు కూడా విచారించాలంటూ చాలామంది నేతలు డిమాండ్ చేయడంతో విచారిస్తూ ఉన్నారు.రన్యా రావు కేసును ఆర్థిక నేరాలకు సంబంధించి ఒక ప్రత్యేక మెజిస్టేషన్ కోర్టుని ఆశ్రయించగా మార్చి 14వ తేదీన ఈమెయిల్ పిటిషన్ తిరస్కరించడం జరిగింది. దీంతో ఆమె స్పెషల్ కోర్టును కూడా ఆశ్రయించారు ..ఇలాంటి సమయంలోనే తెలుగు నటుడు కూడా బెయిల్ కోసం ప్రత్యేకించి కోర్టును ఆశ్రయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.