
అయితే, ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన పూరీ.. ఇప్పుడు హిట్టు కొట్టడం కోసం కిందామీదా అవుతున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్లు పడటంతో, నెక్స్ట్ హీరోలు డేట్లు ఇస్తారో లేదో అన్న పరిస్థితి దాపురించింది పూరీకి. ఈ నేపథ్యంలో పూరీ తదుపరి ప్రాజెక్ట్ గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విషయం ఏమిటంటే? తమిళ వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతితో పూరీ ఓ మూవీ చేస్తారనే వార్త ఓ వైపు మీడియాలో, మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూరీ జగన్నాధ్ ఇటీవలే చెన్నై వెళ్లి విజయ్ సేతుపతికి ఓ స్టోరీ నేరేట్ చేయడం జరిగిందట. కథ నచ్చడంతో హీరో సైడ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
అవును... ఇది తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్విల్ అవుతుందని, కానీ డిస్కషన్ స్టేజ్ లోనే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఉందని, నిర్మాతలు సెట్ అయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేస్తారని గుసగుసలు వినబడుతున్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరగడంతో పూరీ అభిమానులు ఖుషీ అవుతున్నారు. విజయ్ సేతుపతి లాంటి పొటెన్షియల్ యాక్టర్ తో పూరీ సినిమా పడితే మాత్రం నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. పూరీ టాలెంట్ త్వరలో తమిళ పరిశ్రమ కూడా చూడబోతోందని పూరి అభిమానులు ఛాలెంజ్ చేస్తున్నారు. ఇక త్వరలో ఈ విషయంపై క్లారిటీ రావలసి ఉంది.