సాధారణంగా హీరోలకి బాగా హిట్ అయిన సినిమాలే తమ ఫేవరెట్ మూవీ గా ఉంటాయి . ఇండస్ట్రీలో చాలామంది టాప్ హీరోస్ అలాంటి సినిమాలని తమ ఫేవరెట్ మూవీస్ అంటూ బయట పెడుతూ ఉంటారు . కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం అందుకు పూర్తిగా వ్యతిరేకం . ఫ్యాన్స్ కి నచ్చని  సినిమాలు కూడా ఆయనకు హిట్ లిస్టులో ఉంటాయి.  మరీ ముఖ్యంగా తన కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన "ఆరెంజ్" సినిమా ను ఆయన ఓ రేంజ్ లో పొగిడేస్తూ ఉంటాడు.
 

ఆరెంజ్ సినిమా అసలు మెగా అభిమానులకు కూడా నచ్చలేదు . పాటలు పరంగా బాగుంటాయి తప్పిస్తే అసలు ఆ కథ జనాలకి బోర్ కొట్టించే విధంగా ఉండింది . సినిమా రిలీజ్ అయినప్పుడు రాంచరణ్ ని ఏ విధంగా ట్రోల్ చేశారో జనాలు మనకు తెలిసిందే.  ఇప్పటికీఈ ఆరెంజ్  సినిమా టీవీలో వస్తే రాంచరణ్ నటనపై మెగా ఫాన్స్ కూడా మండిపడుతూ ఉంటారు . కానీ ఈ సినిమా అంటే చిరంజీవికి చాలా చాలా ఇష్టమట . ఈ సినిమాలో చరణ్ పర్ఫామెన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని..ఆయన పొగిడేస్తూ ఉంటాడు.



ఒక నటుడికి ఉండాల్సిన క్వాలిటీ అదేనని.  ప్రతి సినిమాలో ఒకే విధంగా నటనను చూపిస్తే అసలు  హీరోనే కాదు అని చిరంజీవి అభిప్రాయపడుతూ ఉంటారట . ఆ కారణంగానే చిరంజీవికి చరణ్ నటించిన సినిమాలలో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీగా ఆరెంజ్ సినిమా నిలిచిందట. ఏ మాత్రం ఫ్రీ టైం ఉన్న ఇంట్లో ముందు  ఆ మూవీ చూస్తారట. కాగా చిరంజీవి నటించిన "విశ్వంభర" సినిమా సమ్మర్ కానుకగా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా అయిపోయిన వెంటనే స్టార్ట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో సినిమా ని సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు . ఈ సినిమాలో చిరంజీవి 30ఏళ్ల ముందుకెళ్ళిపోయి నాటి హీరోగా కనిపించబోతున్నారట. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: