
ఎందుకు ఏమైంది అని ఆరా తీస్తే గత నాలుగేళ్ల క్రితం ఈమె నటించిన రూహీ సినిమా విషయాలను చెప్పకు వచ్చారు. ఆ సినిమాలో నదియో పార్ సాంగ్ బాగా ప్రేక్షకులను మెప్పించింది .. ఇక ఆ పాట షూట్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు జాన్వీ కపూర్ .. ఓ వైపు గుడ్ లక్ జెర్రీ షూట్లో పాల్గొంటూనే ఆ తర్వాత రిహార్సల్స్ కూడా చేసేవారట . అలా ఆ పాట చేయడానికి కాస్త పర్ఫాక్షన్ వచ్చిందని చెప్పగానే షూటింగ్ చేపే వారట .. అలా మూడు రోజులు పాటు నిద్ర లేదని ఆ సేట్లో లైటింగ్ కి కళ్ళు మూసుకుపోయావని జాన్వీ పాత విషయాలను గుర్తు చేసుకుంది.
అయితే ఈ మాటలు విన్నవారు తాజాగా రష్మిక గురించి అల్లు అర్జున్ చెప్పిన మాటను కూడా ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు .. పుష్ప 2 నాన్స్టాప్ ప్రమోషన్లకు హాజరయ్యారు రష్మిక మందన్నా ఆ సమయంలోనే చావాలో ఇంపార్టెంట్ సాంగ్ కూడా షూట్ చేశారు . అటు చావా సాంగ్ షూటింగ్లో పాల్గొంటూనే మరో పక్క పుష్ప 2 పనులతో మూడు నాలుగు రోజులు నిద్ర లేదట రష్మికకు . అలా ట్రావెల్ సమయంలోనే కునుకు తీసేదట .. ఇలా హీరోయిన్ల లైఫ్ ఇంత సూపర్ అనుకుంటారు కానీ .. పరిశ్రమ ఏదైనా ఎక్కడ కష్టాలు అక్కడ ఉంటూనే ఉంటాయి అనే డిస్కషన్ మరోసారి గట్టిగా రుజువు అయింది.