టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా నిర్మాతగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు . రీసెంట్ గానే కోర్ట్ సినిమాలో నిర్మాతగా మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు నాని .. చిన్న సినిమాగా వచ్చి కోర్ట్ ప్రేక్షకులు ఎంతగానో మేపించింది .. హీరోగా నాని రెండు సినిమాలు తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు .. వాటలో హీట్ 3 ఒకటి , ప్యారడైజ్ మరొకటి ఈ రెండు సినిమాల్లో నాని విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు .. హిట్ 2 భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే .. అలాగే ది ప్యారడైజ్ ఒక యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది .  ఇక ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహిస్తున్నారు . ఇక శ్రీకాంత్ చివరగా నానితో దసరాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు .. ది ప్యారడైజ్ సినిమా టైటిల్ టీజర్ రీసెంట్ గానే ప్రేక్షకులు ముందుకు వచ్చింది .
 

నాని డిఫరెంట్ లుక్ లో కనిపించాడు , తన భయంకరమైన రూపం శరీరాకృతి అలాగే రెండు జడలతో అందరి దృష్టిని ఆకర్షించాడు .. విభిన్న కథతో వ‌స్తున‌ఈ సినిమాలో చాలామంది నటీనటులు నటిస్తున్నారని కూడా తెలుస్తుంది .. ఇప్పటికే ఈ సినిమాలో ఆర్.నారాయణమూర్తి నటిస్తున్నారని ప్రచారం కూడా గట్టిగా జరుగుతుంది .. ఇటీవల దర్శకుడు శ్రీకాంత్ నారాయణుమూర్తిని కూడా కలిశారు .. అయితే ఇప్పుడు ఈ సినిమాలో నటించే విలన్ గురించి ఆసక్తికర వార్త ఇప్పుడు బయటకు వచ్చింది ..

 

ది ప్యారడైజ్ సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారని టాక్‌ గట్టిగా వినిపిస్తుంది .  నాని సినిమాలో మోహన్ బాబు విలన్ గా నటించే అవకాశం కూడా ఉందనే వార్తలు వస్తున్నాయి .. అయితే దీనికి సంబంధించిన ఇంకా అధికార ప్రకటన బయటికి రావాల్సి ఉంది .. ఇదిలా ఉంటే మోహన్ బాబు తన కొడుకు విష్ణు నిర్మిస్తున్న కన్నప్ప సినిమాలో కూడా నటిస్తున్నారు .  ఇక మోహన్ బాబు తన కెరీర్ను విలన్ పాత్రలతో మొదలు పెట్టాడని చాలామందికి తెలియదు .. చాలా సంవత్సరాలు తర్వాత ఆయన మళ్లీ విలన్ ఫీల్డ్ లోకి తిరిగి రావటం అభిమానుల కొంత ఇంట్రెస్ట్ రేపుతుంది . ది ప్యారడైజ్ సినిమాలో మోహన్ బాబు పాత్ర పై త్వరలోనే పూర్తి వివరాలు బయటికి రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: