
హర్ష సాయికి వచ్చిన పాపులారిటీతో ఏకంగా హీరోగా కూడా ఒక సినిమాను ప్రకటించారు. అలాంటి సమయంలోనే నటి మిత్ర శర్మ, హర్ష సాయి పైన లైంగిక వేధింపులు చేశారంటూ పలు రకాల ఆరోపణలు చేసింది. అలాగే ఆ సినిమా కాపీ రైట్స్ విషయంలో కూడా తనని వేధించారంటూ ఆమె కేసు పెట్టడం జరిగింది. అయితే ఆ సమయంలో హర్ష సాయి ఎక్కడ కనిపించలేదు.. విదేశాలకు పారిపోయారని విధంగా పోలీసులు నోటీసులు కూడా అందించారు. హర్ష సాయి తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ ఆ కేసు నడుస్తోంది.
ఇటీవలే ఐపీఎస్ సజ్జనర్ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ సైతం ఎవరైనా ప్రమోషన్ చేస్తే వారందరినీ కూడా కేసులు పెట్టి జైలుకు పంపించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం వంటివి చేస్తున్నారని ఇంటర్వ్యూలో చెప్పడంతో అతని గురించి కూడా పోస్ట్ షేర్ చేయడం జరిగింది. దీంతో హర్ష సాయి పైన పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. దీంతో హర్ష సాయి కనపడకపోవడంతో బిగ్ బాస్ బ్యూటీ మిత్ర శర్మ కూడా ఈయన గురించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది..
ఇంస్టాగ్రామ్ లో ఇలా రాసుకోస్తూ హలో మిస్టర్ చీటర్ మళ్ళీ బ్యాంకాంగ్ పారిపోయావా.. నువ్వు మమ్మల్ని చీట్ చేసి మా జీవితాలను నాశనం చేసావని ఇప్పుడు నీకు కర్మ తగులుతుంది.. ఇప్పటికైనా మా మాట విని మారు నువ్వు అంటూ తెలిపింది. నీ తప్పులు ఒప్పుకో ఈ రోజే బ్యాంకాక్ నుంచి మారిపోయి రా అంటూ పోస్ట్ షేర్ చేసింది మిత్ర శర్మ. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.