పాన్ ఇండియా హీరో ప్రభాస్  స్పీడ్ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు .. వ‌రుస‌ సినిమాలతో ఫుల్ బిజీగా కొనసాగుతున్నారు .. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉన్నారు .. సలార్ , కల్కి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా విజ‌య‌లు అందుకున్నారు ఈ రెండు సినిమాలకు సీక్వెల్స్ కూడా రాబోతున్నాయి .. అలాగే హనురాఘవాపుడి డైరెక్షన్లో పౌజీ సినిమా చేస్తున్నాడు అలాగే మారుతితో రాజా సాబ్  సినిమా చేస్తున్నాడు .. ఇలా వరుసగా డిఫరెంట్ సినిమాలు చేస్తూ డిఫరెంట్ పాత్రలో నటిస్తున్నాడు .. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ సినిమా కూడా చేయబోతున్నాడు .. ఈ సినిమాలతో పాటు కన్నప్ప సినిమాలో కూడా కీలకపాత్రలో నటిస్తున్నాడు .


అయితే గతంలో ప్రభాస్ కు అమ్మగా నటిచ్చిన ఓ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా ? ఆమె ప్రభాస్ కు అమ్మగానే కాదు ఆయన ప్రాణ స్నేహితుడు గోపీచంద్ కు వదినగాను కూడా నటించింది .. ఇంతకీ ఆమె ఎవరు అంటే .. ప్రభాస్ కు  అమ్మగా న‌టించిన  హీరోయిన్ అనగానే మనకు బాహుబలిలో అనుష్క గుర్తుకు వస్తుంది .. కానీ ఆమె కానే కాదు .. ఈ హీరోయిన్ ఎవరంటే ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించిన కళ్యాణి .  కళ్యాణి , ప్రభాస్ కు అమ్మగా గోపీచంద్ కు వదినగా నటించారు .


ప్రభాస్ నటించిన మున్న సినిమా గుర్తుండే ఉంటుంది .. ఈ సినిమాలో ప్రభాస్ తండ్రి గా ప్రకాష్ రాజ్ నటించారు .. ఆయన మొదటి భార్య‌గా కళ్యాణి నటించారు .. అలా ఆ సినిమాలో ప్రభాస్ కు తల్లి పాత్రలో నటించారు .. ఇక గోపీచంద్ హీరోగా వచ్చిన లక్ష్యం సినిమాలో ఆయన వదినగా జగపతిబాబు భార్యగా నటించింది కళ్యాణి .  ఇక కళ్యాణి ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది .. ఆ తర్వాత వరుస‌ సినిమాలో నటించారు .. ఆ తర్వాత సినిమాలుకు దూరమయ్యారు .  ఇక తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆడపాదప సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: