10 సంవత్సరాల క్రితం విడుదలైన ‘బిచ్చగాడు’ ఒక సంచలనం. డబ్బింగ్ సినిమాగా విడుదలైన ఆ మూవీ ఆరోజులలో కలక్షన్స్ వర్షం కురిపించింది. ఆమూవీ తరువాత విజయ్ ఆంటోని నటించిన ఎన్నో సినిమాలు విడుదల అయినప్పటికీ ఏఒక్క సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందలేదు. అయినప్పటికీ విజయ్ తనవంతు ప్రయత్నాలు చేస్తూ ప్రతి సంవత్సరం సినిమాలలో నటిస్తూనే ఉన్నాడు.

అతడి కెరియర్ లో 25వ సినిమాగా విడుదల అవుతున్న ‘భద్రకాళి’ విజయ్ కెరియర్ లో 25వ సినిమా. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా అన్ని భాషలలోనూ విడుదల చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ ఈ సమ్మర్ లో విడుదలచేయబోతున్న ఈ మూవీ టీజర్ ను చూసిన వారికి ఒక వెరైటీ కథ విజయ్ ఆంటోని ఈమూవీలో చెప్పబోతున్నట్లు అని పిస్తోంది.  

ఆరు వేల కోట్ల స్కామ్ జరిగితే ప్రభుత్వం తలకిందులయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఆపరిస్థితికి కిట్టు అనే యువకుడు కారణమని తెలుసుకున్న పోలీసులు ప్రభుత్వం అతనిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నంలో ఈమూవీ కథలో ఎన్నో ట్విస్టులు ఉంటాయని తెలుస్తోంది. ఈమూవీకి ‘భద్రకాళి’ అన్న టైటిల్ పెట్టె విషయంలో అనేక వివాదాలు విజయ్ ఆంటోనికి ఎదురయ్యాయి.

చివరకు ఈ టైటిల్ విషయంలో అతడు తన పంతం నెగ్గించుకున్నాడు. విజయ్ ఆంటోనీ స్వయంగా సంగీతం సమకూర్చుకున్న ఈ మూవీలో పేరు మోసిన నటీనటులు ఎవరు లేకపోయినప్పటికీ ఈ సినిమా తనకు ఖచ్చితంగా హిట్ ఇచ్చి తీరుతుందని విజయ్ నమ్ముతున్నాడు. ఈమధ్య కాలంలో కొన్ని డబ్బింగ్ సినిమాలు ఊహించని సక్సస్ అందుకుంటున్నాయి. అలాంటి లక్ ఈ తమిళ హీరోకి ఎంతవరకు ఉందోలేదో చూడాలి. ఈసమ్మర్ కు టాప్ హీరోల సినిమాలు ఏమీ పెద్దగా లేకపోవడంతో తన సినిమా కంటెంట్ ను నమ్ముకుని ఈతమిళ హీరో తెలుగు ప్రేక్షకుల పై దండయాత్ర చేస్తున్నాడు అనుకోవాలి. వెరైటీ సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు ఈమూవీ విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: