సల్మాన్ ఖాన్ తన ఫామ్ హౌస్ లో ఆ హీరో కూతుర్ని మూడు రోజులు ఉండమని చెప్పారా..ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన దబాంగ్ -2 సినిమా అందరూ చూసే ఉంటారు అయితే ఈ సినిమాలో సౌత్ నటుడు కిచ్చా సుదీప్ విలన్ పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే కిచ్చా సుదీప్సినిమా షూటింగ్లో పాల్గొన్న టైంలో ఆయన తన కూతుర్ని కూడా వెంటబెట్టుకుని వెళ్లారట. ఆ టైంలో సల్మాన్ ఖాన్ ని చూసిన సుదీప్ కూతురు సాన్వి సుదీప్ చాలా ఎగ్జైట్ అయ్యిందట. ఆ తర్వాత సుదీప్ తన కూతురు సాన్విని తీసుకొని సల్మాన్ ఖాన్ ఇంటికి డిన్నర్ కి వెళ్ళారట.ఆ టైంలో సాన్వి చాలా బాగా రెడీ అయి వెళ్లిందట. ఇక చిన్నతనంలో సాన్వి సల్మాన్ ఖాన్ మీద ప్రేమతో ఒక బ్రాస్లెట్ చేయించిందట.ఆ బ్రాస్లెట్ ని బిగ్ బాస్ టైంలో ఆయన పెట్టుకున్నారని సాన్వి చెప్పుకొచ్చింది.

 అయితే సాన్విని తీసుకొని సుదీప్ సల్మాన్ ఖాన్ ఇంటికి వెళ్ళిన సమయంలో సాన్విని చూసి ముచ్చటపడ్డ సల్మాన్ ఖాన్ ఆమె గొంతు చూసి ఆశ్చర్యపోయి ఒక పాట పాడమని బలవంత పెట్టారట. అయితే ఎంతో చక్కగా శాన్వి పాట పాడడంతో ఆ పాట బాగా నచ్చి అర్ధరాత్రి మూడు గంటలకు తన మ్యూజిక్ డైరెక్టర్ కి ఫోన్ చేసి ఆ అమ్మాయి వాయిస్ ఏమైనా మనకు పనికి వస్తుందో చూడండి ఒకసారి రికార్డు చేయండి అని చెప్పారట.ఆ తర్వాత మళ్లీ సల్మాన్ ఖాన్ సుదీప్ కూతురు శాన్విని తన ఫామ్ హౌస్ కి తీసుకువచ్చి మూడు రోజులు ఉంచుకున్నారట. ఆ టైంలో సల్మాన్ ఖాన్ తనను వదిలి వేయలేదని,తన చుట్టూ తన తల్లిదండ్రులు ఉన్నారో లేదో తెలియకుండా అక్కడే ఉన్నానని నేను ఆయనతో కలిసి జిమ్ కి వెళ్లాను..

స్విమ్మింగ్ చేశాను అంటూ శాన్వి సుదీప్ చెప్పుకొచ్చింది.అయితే నేను ఇంటికి వెళ్తానంటే సల్మాన్ ఖాన్ నన్ను వెళ్ళనివ్వలేదు.ఉదయం నుండి రాత్రి వరకు ఆయన నాతోనే ఉన్నారు. మూడు రోజుల వరకు ఫార్మ్ హౌస్ లోనే ఉన్నాను. కానీ ఈ విషయం గురించి చాలామంది చెడుగా అర్థం చేసుకుంటారు అంటూ కిచ్చా సుదీప్ కూతురు సాన్వి సుదీప్ రీసెంట్గా జినాల్ మోడీ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ బహిరంగంగానే చెప్పేసింది. అయితే ఈ విషయం తెలిసి చాలామంది తప్పుగా అనుకుంటారు.కానీ సల్మాన్ ఖాన్ దబాంగ్ సినిమా చేసిన సమయంలో శాన్వి సుదీప్ వయసు దాదాపు 15 సంవత్సరాలు మాత్రమే.

మరింత సమాచారం తెలుసుకోండి: