
నా దృష్టిలో సూపర్ స్టార్ మహేష్ బాబు దేవుడు అని నా అన్వేషణ అన్వేష్ చెప్పుకొచ్చారు. హర్షసాయి 10 లక్షల రూపాయలు తీసుకుని లక్ష రూపాయలు సహాయం చేస్తున్నాడని అన్వేష్ తెలిపారు. మహేష్ బాబు ఎంతోమంది చిన్న పిల్లలకు హార్ట్ సర్జరీలు చేయించారని ఆయన అన్నారు. మహేష్ బాబు చేసే సాయమంటే అని అన్వేష్ కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు రెమ్యునరేషన్ పరంగా టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే. మహేష్ బాబు ఇతర భాషల్లో సైతం ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ను మార్చుకున్న సంగతి తెలిసిందే. బాలయ్య, పవన్ సైతం ఎవరికీ చెప్పకుండా ఎంతో సహాయం చేస్తున్నారని తెలుస్తోంది.
నా అన్వేషణ అన్వేష్ చేసిన కామెంట్లను నెటిజన్లు సైతం తెగ వైరల్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 2027లో మహేష్ జక్కన్న కాంబో మూవీ విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నయి. సూపర్ స్టార్ మహేష్ బాబు రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. మహేష్ బాబు కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతూ ఎంతోమంది ప్రశంసలు అందుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.