బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన అమితాబ్ బచ్చన్ గురించి తెలియజేయాల్సిన పనిలేదు 85 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ అభిమానులను అల్లరిస్తూ తనదైన స్టైల్ లో సినిమాలలో నటిస్తూ ఉన్నారు. ప్రతి సినిమాకి కూడా తన క్రేజ్ ని పెంచుకుంటున్న అమితాబ్ బచ్చన్ దేశంలోనే అత్యధికంగా ట్యాక్స్ కట్టే సెలబ్రిటీగా పేరు సంపాదించారు. 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించి బిగ్ బి సంపాదన 350 కోట్లు ఉన్నదట. ఈ ఆదాయం పైన అమితాబ్ బచ్చన్ 120 కోట్ల వరకు పనులు చెల్లించినట్లు సమాచారం.

అలా అమితాబ్ బచ్చన్ దేశంలోనే అత్యధిక పన్ను చెల్లించిన నటుడు గా పేరు సంపాదించారు. గత ఏడాది షారుక్ ఖాన్ 92 కోట్లు ట్యాక్స్ కట్టగా మొదటి స్థానంలో నిలిచారు.. ఇప్పుడు ఆ రికార్డును కూడా అమితాబ్ బచ్చన్ చెరిపేసినట్లు తెలుస్తోంది. మార్చి 15 ..2025 తన చివరి వాయిదా 52.50 కోట్ల రూపాయలను చెల్లించినట్లు తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్ ఇండియన్ సినీ పరిశ్రమలోనే అధిక మొత్తంలో చెల్లించిన నటుడుగా పేరు సంపాదించారు. ఇక అమితాబచ్చన్ ఒక్కో బ్రాండ్ ప్రమోషన్స్ కి 5 నుంచి 10 కోట్ల వరకు తీసుకుంటారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.


గత ఏడాది ప్రభాస్ నటించిన కల్కి 2898AD చిత్రంలో అశ్వద్ధామ పాత్రలో అద్భుతంగా నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకోవడం జరిగింది. దీంతో మరొకసారి దేశవ్యాప్తంగా కూడా పేరు సంపాదించారు అమితాబచ్చన్. అలాగే కల్కి 2 చిత్రంలో కూడా పాల్గొనబోతున్నారు వీటితో పాటుగా పలు రకాల షోలలో కూడా కనిపిస్తూ ఉంటారు అమితాబ్ బచ్చన్. మరి రాబోయే రోజుల్లో టాలీవుడ్ లో కూడా ఏవైనా పలు చిత్రాలలో నటించి మరింత అభిమానులకు చేరువవుతారేమో చూడాలి మరి. బాలీవుడ్ లో కూడా ఈమధ్య హీరోగా అవకాశాలు తగ్గించి పలు కీలకమైన పాత్రలు నటిస్తున్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: