గతవారం విడుదలైన ‘దిల్ రుబా’ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో కిరణ్ అబ్బవరం షాక్ కు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవీ పై దర్శక నిర్మాతలకు అదేవిధంగా హీరోకు విపరీతమైన నమ్మకం ఉండటంతో ఈమూవీ విడుదలకు ముందే ప్రీమియర్ షోలు వేశారు. అయితే ఆప్రీమియర్ షోల నుండి విపరీతమైన నెగిటివ్ టాక్ రావడంతో ఈమూవీని చూడటానికి ఎవరు పెద్దగా ఆశక్తి కనపరచక పోవడంతో ఈమూవీకి భయకరమైన కలక్షన్స్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.



గతసంవత్సరం దీపావళికి విడుదలైన ‘క’ మూవీ మంచి సక్సస్ సాధించడంతో ఈమూవీ ఖచ్చితంగా 10 కోట్లవరకు కలక్షన్స్ సాధిస్తుందని అంచనాలు వచ్చాయి. అయితే కనీసం ఈమూవీకి 5 కోట్ల కలక్షన్స్ కూడ వచ్చే ఆస్కారం లేదు అంటూ వార్తలు వస్తూ ఉండటంతో ఈమూవీ బయ్యర్లు టెన్షన్ పడుతున్నట్లు టాక్. ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రస్తుతం కిరణ్ అబ్బవరం నటిస్తున్న ‘కె ర్యాంప్’ యూనిట్ వర్గాలు ఎలర్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.



తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ కేరళ కాలేజీ బ్యాక్ డ్రాప్ లో మంచి యూత్ ఫుల్ కంటెంట్ తో తీసే విధంగా స్క్రిప్ట్ తయారు చేశారని టాక్. ఈమూవీలో లిప్ లాక్ సీన్స్ తో పాటు హాస్యం కూడ బాగా ఎక్కువగా ఉండేలా స్క్రిప్ట్ వ్రాసుకున్నారని తెలుస్తోంది. అయితే ‘దిల్ రుబా’ ఫిలితంతో ఈమూవీ స్క్రిప్ట్ లో ఏమైనా పొరపాట్లు జరిగాయా అని ఒకటికి పది సార్లు సరి చూసుకున్న తరువాత ఈ మూవీ షూటింగ్ కు వెళ్లాలని ఈ మూవీ నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.



యూత్ ని టార్గెట్ చేస్తూ ఈమూవీలోని కథ ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే విషయంలో పొరపాట్లు జరిగితే ఫలితం వేరుగా ఉంటుంది అన్నభయం ఏర్పడటంతో ఈ మూవీ యూనిట్ మరొకసారి స్క్రీన్ ప్లే విషయంలో మరింత శ్రద్ధ పెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు లీకులు వస్తున్నాయి. ఈమూవీని జైన్స్ నాని అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోంది. చేతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈమూవీ అయినా హిట్ కొట్టాలని కిరణ్ అబ్బవరం అభిమానులు  ఆశిస్తున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: