- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


టాలీవుడ్ లో ఇప్పుడు ప్ర‌భాస్ మానియా న‌డుస్తోంది. ప్ర‌భాస్ అంటే పాన్ ఇండియా హీరో ... ప్ర‌భాస్ సినిమా వ‌స్తుందంటే చాలు పాన్ ఇండియా రేంజ్ లోనే అంచ‌నాలు ఉంటున్నాయి. ఇక ప్రభాస్ హీరోగా నటించిన రీసెంట్ సినిమాల‌లో వ‌రుస‌గా రెండు హిట్లు ప‌డ్డాయి. ఒక‌టి ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తన నుంచి వచ్చిన మాస్ హిట్ సినిమా సలార్ సీజ్ ఫైర్. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఏకంగా రు. 600 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది. ఇక రెండోది ఆ వెంట‌నే నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం లో వ‌చ్చిన క‌ల్కి సినిమా. ఇక స‌లార్ సినిమా కు ..ఇటు క‌ల్కి సినిమా కు సీక్వెల్స్ కూడా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.


ఇక స‌లార్ సినిమా ను మళ్ళీ ఇపుడు రీ రిలీజ్ కి తెస్తుండ‌గా ... దీనికి సాలిడ్ ప్రీసేల్స్ కనిపిస్తున్నాయి. ప్రీ సేల్స్ లోనే స‌లార్ అరాచ‌కం క్రియేట్ చేసేలా క‌నిపిస్తోంది. ఈ నెల 21న స‌లార్ సినిమా రీ రిలీజ్ అవుతోంది. అయితే సినిమా బుకింగ్స్ ఎప్ప‌టి నుంచో ఊపందుకున్నాయి. బుకింగ్స్ ద్వారానే ఇప్ప‌టికే స‌లార్ సినిమా ప్రీ సేల్స్ లో కోటి రూపాయ‌ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇది నిజంగా ప్ర‌భాస్ రాజు క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు నిద‌ర్శ‌నం. ఇది కేవలం డే 1 కి మాత్రమే కాగా నెక్స్ట్ వ‌సూళ్లు వీరంగం ఎలా ఉంటుందో చూడాలి. స‌లార్ లో మ‌ళ‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటించగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఇక ప్ర‌స్తుతం ప్ర‌భాస్ న‌టిస్తోన్న ది రాజా సాబ్ , స‌లార్ , క‌ల్కి 2 సెట్స్ మీద ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: