
అయితే ఇది థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమా కాదు .. ఓ కమర్షియల్ యాడ్ లో భాగంగా తీసిన వీడియో .. ధోని , సందీప్ ఇద్దరు ఈ మోటార్ అనే ఎలక్ట్రానిక్ సైకిల్ యాడ్ కోసం కలిశారు .. ఇక దీనికి సందీప్ వంగ డైరెక్షన్ చేయడమే కాదు ధోనితో కలిసి అందులో నటించాడు .. యనిమల్ సినిమాలోని రణబీర్ కపూర్ నటించిన పలు సన్నివేశాలను ధోనితో రి క్రియేట్ చేశారు .. ఇప్పుడు తాజాగా ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . యానిమల్ రణబీర్ కపూర్ సూటు బూటు వేసుకుని తన గ్యాంగ్ తో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ సీక్రెట్ తాగుతూ వెళ్లే సన్నివేశాన్ని .. అలాగే రష్మిక మందన్ని ఎంగేజ్మెంట్ అప్పుడు బైక్ మీద వెళ్లే సన్నివేశం ఎంతో హైలెట్ గా ఉంటాయి .. ఇక ఇప్పుడు ఈ యాడ్లో లాంగ్ హెయిర్ తో పూర్తిగా రన్బీర్ లుక్ లోకి మారిపోయాడు ధోని ..
కారు దిగి టూత్ పిక్ నోట్లో పెట్టుకుని తన గ్యాంగ్ తో స్టైల్ గా నడుచుకుంటూ ముందుకు వెళ్తు .. ఆ టైంలోనే దర్శకుడు సందీప్ రెడ్డి కట్ చెప్పి మైండ్ బ్లోయింగ్ ఫెంటాస్టిక్ మాజా వచ్చింది జనాలు ఇది చూసి విజిల్స్ వేస్తారు అంటూ క్లాప్ కొడతాడు .. నా హీరో రెడీ అంటూ ధోనిని చూసి ఎగ్జైట్ అవుతాడు. అయితే బైక్ మీద కాకుండా ఒక ఈ సైకిల్ మీద వచ్చేలా సీన్ ప్లాన్ చేయటం పై ధోని కి అసలు ఏమీ అర్థం కానట్లు చూస్తూ ఉంటాడు దాని గురించి దర్శకుడు వంగాన్ని అడగబోతే క్లైమాక్స్ షాట్ కోసం రెడీగా ఉడ్డమని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు .. లాస్ట్ లో యానిమల్ లో రన్బీర్ కపూర్ స్టైల్ లో ఓ సిగ్నేచర్ మూమెంట్ చేయడం తో ఈ యాడ్ కంప్లీట్ అవుతుంది .. ఇక ధోని , సందీప్ కలిసి చేసిన ఈ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది .