
ఇక ఇంకో దర్శకుడు జ్యోతి కృష్ణ ప్రచారం కోసం ముందుకు వచ్చిన బజ్ రావటం మాత్రం కష్టం .. ఇక నిర్మాత ఏఎం రత్నం సంగతి తెలిసిందే . ఈ విధంగా ఈ సినిమాకు మిగిలిన ఒకే ఒక ప్రచార అస్త్రం హీరోయిన్ నిధి అగర్వాల్ .. ఇక ఇప్పటికే ఈ సినిమా కోసం కొన్ని సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్న ఈ హీరోయిన్ .. ఇప్పుడు ప్రచార బాధ్యతని కూడా తన భుజాల మీద వేసుకుంది .. దాదాపు రెండు వారాల పాటు నిధి అగర్వాల్ తో వివిధ ప్రచార కార్యక్రమాలను కూడా ప్లాన్ చేశారు .. ఇక వీటిలో సిటీ టూర్స్ కూడా ఉండబోతున్నాయి .. ఇక ఈ సినిమా తన కెరీర్ ను ఊహించిన మలుపు తిప్పుతుందని ఒకే ఒక్క ఆశతో నిధి అగర్వాల్ ఈ సినిమా కోసం తెగ కష్టపడుతుంది . ఇక మరి పవన్ కళ్యాణ్ , నిధి అగర్వాల్ కు ఎలాంటి సక్సెస్ ఇస్తాడు .. అనేది సినిమా రిలీజ్ వరకు ఎదురు చూడాల్సిందే .