
యంగ్ హీరో కార్తీతో కలిసి ఊపిరి, తర్వాత నానితో దేవదాస్, ఇక అల్లరి నరేష్ - రాజ్ తరుణ్ తో కలిసి నా సామి రంగ సినిమాలోని మెరిసిన నాగ్.. ప్రస్తుతం రజనీకాంత్, ధనుష్‌లతో కుబేర, కూలి సినిమాలతో మల్టీ స్టారర్ సినిమాలో చేస్తున్నాడు. ఇలాంటి క్రమంలో నాగార్జున గతంలో మహేష్ బాబుతో ఓ మల్టీ స్టారర్ సినిమాను మిస్ అయ్యాడు అంటూ న్యూస్ వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ మూవీ ఏంటో.. అసలు అది మిస్ అవ్వడానికి కారణం ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. గతంలో నాగార్జున.. మహేష్ బాబుతో మల్టీ స్టారర్‌ను మిస్ అయ్యడని.. ఓ డైరెక్టర్ హ్యాండ్ ఇవ్వడంతో ఈ కాంబినేషన్ మిస్ అయిందని టాక్. ఇక మహేష్ బాబు, వెంకటేష్ కలిసి బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా ఇటీవల రీ రిలీజ్‌లోను మంచి ఆదరణ దక్కించుకుంది. అయితే మొదట్లో ఈ సినిమా వెంకటేష్ పాత్ర కోసం నాగార్జునను భావించారట డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. నాగార్జున దగ్గరికి వెళ్లి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చిన్న లైన్ మాత్రమే శ్రీకాంత్ వివరించడంతో.. నాగార్జున చూద్దామని చెప్పారట. ఇక పూర్తి కథను ప్రిపేర్ చేసే క్రమంలో.. సురేష్ బాబు నుంచి ఫోన్ రావడం.. ఆయన వెంకటేష్‌తో ఓ సినిమా చేద్దామని చెప్పడంతో.. శ్రీకాంత్ నాగార్జునకు చెప్పిన ఆ లైన్ ను కాస్త పొడిగించి.. కథగా సురేష్ బాబు, వెంకటేష్‌లకు చెప్పారట. వాళ్ళిద్దరికీ నచ్చడంతో వెంటనే దిల్ రాజును పిలిచి ఈ సినిమాకు ఫిక్స్ చేశారు. ఇక దీనికి మహేష్ బాబును ఒప్పించి వెంటనే సినిమా సెట్స్‌పైకి తీసుకువచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాడు శ్రీకాంత్ అడ్డాల. అయితే డైరెక్టర్.. నాగార్జున మాటలు కాదని.. వెంకటేష్ వద్దకు వెళ్లి ఆయనతో గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నాడు. లేదంటే.. నాగార్జున, మహేష్ కాంబోలో ఈ సినిమా వచ్చి ఉండేది.