
ఇక ఇప్పుడు వారందరిపై సీనియర్ పోలీస్ ఆఫీసర్ సజ్జనర్ ఒక్కసారిగా సీరియస్ అయ్యారు .. వాస్తవానికి ఆయన ప్రస్తుతం ఆర్టీసీ డిపార్ట్మెంట్ కు ప్రధాన అధికారిగా ఉన్నప్పటికీ ఒక పోలీస్ గా ఆయన బాధ్యతను మాత్రం ఆయన మర్చిపోలేదు . అందుకే ఇలా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారందరి మీద ఉక్కు పాదం మోపారు .. ట్రావెల్ ఇన్ఫిలెన్సర్ నా అన్వేషణ సహాయంతో ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారందరినీ గుర్తించడం మొదలు పెట్టాడు సజ్జనార్ ఆయన టీం అప్పటి నుంచి సెలబ్రిటీల అందరూ తెగ టెన్షన్ పడిపోతున్నారు .
ఇక చాలామంది ఇప్పటికే బ్యాటింగ్ యాప్స్ కు దూరంగా ఉండండి అంటూ ఎవరికి వారు వీడియోలు రిలీజ్ చేయడం కూడా ప్రారంభించారు .. ఇక మరి ఇలాంటి వీడియోలు పెట్టినందుకు సజ్జనర్ ఏమైనా విరీని కరుణిస్తారా లేక ఇప్పటికీ నిన్న 11 మంది మీద కేసులు వేసినట్టు టాలీవుడ్ సెలబ్రిటీలో పాత బెట్టింగ్ ప్రమోషన్ వీడియో అన్ని తవ్వి తీసి అందరినీ ఇబ్బందుల్లో నెట్టేస్తారా అనేది వేచి చూడాలి .. కాకపోతే సజ్జనర్ కేవలం సినిమా వాళ్ళ మీదే కాక లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కూడా కాస్త ఫోకస్ పెడుతున్నారట .