
ఆ తర్వాత ఈమె పలు చిత్రాలలో నటించిన పరవాలేదు అనిపించుకున్న షాలిని ఆ తర్వాత మళ్లీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. దీంతో బాలీవుడ్ వైపుగా వెళ్లి అక్కడ పలు చిత్రాలలో నటిస్తూనే ఉంది. అయితే ఇమే ఇటీవలే తెరకెక్కించిన డబ్బావాలా అనే అనే సిరీస్లో ఈమె బలమైన పాత్రలో నటించింది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న షాలిని ఆమెకు ఒక ప్రశ్న ఎదురయ్యిందట.. అర్జున్ రెడ్డి లాంటి చిత్రంలో మీరు మళ్లీ నటిస్తారా అంటూ యాంకర్ ప్రశ్నించగా?. దిమ్మతిరిగే సమాధానం చెప్పింది షాలిని.
అది నా కెరియర్ మొదటిలో వచ్చిన సినిమా అందులో తన పాత్ర కొంచెం బలహీనంగా ఉంటుంది.మరొకసారి అలాంటి సినిమాలో అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తాను కాకపోతే డైరెక్టర్ తో మాట్లాడి అందులో కొన్ని మార్పులు చేయించుకుంటానంటూ వెల్లడించింది.. సినిమాలలో బలమైన పాత్రలు చేయాలని ఉంది అలాంటి కోరిక తనకు డబ్బావాలా కార్టెల్ సిరీస్ తో తన కోరిక తీరిపోయింది అంటు వెల్లడించింది. మొత్తానికి శాలిని పాండే అర్జున్ రెడ్డి చిత్రంలో తనది బలమైన పాత్ర కాదు అయినా కూడా తనకు ఈసారి అవకాశం వస్తే అంతకుమించి నటిస్తాను అంటూ చెప్పడం గమనార్హం. గతంలో కూడా సందీప్ రెడ్డి వంగ కు అర్జున్ రెడ్డి చిత్రంలో హీరోయిన్ పాత్ర పైన ప్రశ్నించడంతో.. షాలిని నే ఆ పాత్రకు కరెక్టుగా సరిపోయిందని తెలిపారు.