
తెలుగులో లక్ష్మీ, బాస్, బిల్లా, శ్రీరామరాజ్యం, దుబాయ్ శీను, యోగి, తులసి, అదుర్స్ వంటి సినిమాలలో నటించింది. ఈమె టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కూడా ప్రభాస్, వెంకటేష్, నాగార్జున, రవితేజ, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో నటించింది. ఈమె తెలుగు ప్రేక్షకుల నుండి కూడా ప్రేమ, ఆదరణ పొందింది. ఈ అందాల భామ నంది, ఫిల్మ్ ఫేర్ లాంటి అవార్డులను కూడా సొంతం చేసుకుంది.
ప్రస్తుతం నయనతార సినిమాలలో నటించడం తగ్గించింది. ఇప్పటికే ఈమె నటిగా చేసి మంచిగా సంపాదించుకుంది. అయితే తాజాగా ఈ గ్లామరస్ బ్యూటీ తాను సంపాదించుకున్న డబ్బుతో కోట్లు విలువ చేసే ఇల్లు కొనుగోలు చేసింది. చెన్నైలోని పోయెస్ గార్డెన్ ఏరియాలో మూడు అంతస్తుల ఇల్లును కొనుగోలు చేసింది. ఆ ఇంటిలోనే గ్రౌండ్ ఫ్లోర్ లో స్టూడియో సెటప్, పైన ఇల్లు డిజైన్ చేసుకుంది అంట. ఈ ఇల్లు ఖరీదు దాదాపు రూ. 100 కోట్లు ఉంటుందంట. ప్రస్తుతం ఆ ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఇల్లు హీరో రజినీకాంత్, ధనుష్ ల ఇంటికి దగ్గరగా ఉంటుంది అంట. ఈ ఫోటోస్ చూసిన నెటిజన్స్ వామ్మో ఇల్లుకి అన్ని కోట్ల అంటూ ఆశ్చర్యపోతున్నారు.