
ఇక తాజాగా ఈ యాప్స్ ని ప్రమోట్ చేసిన లిస్ట్ లో చాలా మంది సెలబ్రిటీలు, యాంకర్ లు, యూట్యూబర్ లు ఉన్నారు. ఈ క్రమంలో మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన లిస్ట్ లో ఉంది. మంచు లక్ష్మీ గతంలో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిందని తెలుస్తోంది. దీంతో లక్ష్మీపైన కూడా కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. మంచు లక్ష్మీతో పాటుగా మరికొందరు సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నట్లు సమాచారం. హీరో రానా, హీరోయిన్ కాజల్ అగర్వాల్, సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ బెట్టింగ్ యాప్స్ యాడ్స్ లో నటించారని వారిపై కూడా చర్యలు తీసుకొనున్నట్లు టాక్ వినిపిస్తుంది.
ఇదిలా ఉండగా.. ఇటీవలే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో 11 మంది సెలబ్రిటీలపై పంజగుట్ట పోలస్ స్టేషన్ లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్లలో యాంకర్ విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, యూట్యూబర్ టేస్టీ తేజ, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, రీతూ చౌదరి, సుప్రీత, సుధీర్, అజయ్, సన్నీ యాదవ్, సందీప్ ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరిపైన 318(4) BNS, 3, 3(A), 4 TSGA, 66D ITA Act- 2008 సెక్షన్ ల కింద కేసు నమోదు అయ్యిందని సమాచారం. మరి ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.