
ఇదిలా ఉండగా.. ఒక సూపర్ హిట్ సినిమా థియేటర్ లోకి రానుంది. నటుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్రాగన్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమాకు అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఈ సినిమా తమిళ భాషలో నిర్మించారు. ఈ సినిమా ఒక కామెడీ డ్రామా. డ్రాగన్ మూవీలో ప్రదీప్ కి జోడీగా అనుపమ పరమేశ్వరన్, కయాడు లోహర్ నటించారు. ఇక ఈ సినిమా ఇటీవల విడుదల అయ్యి మంచి టాక్ ని సొంతం చేసుకుంది.
అయితే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి రానుంది. ఈ నెల 21 నుండి ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనుంది. తాజాగా ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ సౌత్ ఇండియా సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఈ సినిమా కాలేజీ లైఫ్ గురించి తెరకెక్కించిన చిత్రం. ఈ సినిమా ఇప్పటికే థియేటర్ లలో హిట్ కొట్టగా.. ఇప్పుడు ఓటీటీలో మరోసారి హిట్ కొట్టేందుకు సిద్దంగా ఉంది. ఈ సినిమాపై నెటిజన్స్ కి భారీగా అంచనాలు ఉన్నాయి.