పూరి జగన్నాథ్ ఈ డైరెక్టర్ ఒకప్పుడు ఎంత పెద్ద పేరున్న వాడో చెప్పనక్కర్లేదు. కానీ ఇప్పుడు పూరీ జగన్నాథ్ స్టార్డం మొత్తం పాతాళానికి పడిపోయింది.ఆయన గత కొద్ది రోజుల నుండి ఇస్మార్ట్ శంకర్ సినిమా తప్ప చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి కూడా పడడం లేదు.పూరి జగన్నాథ్ చేసిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి.అయితే పూరి జగన్నాథ్ కెరీర్ ఇలాగే ఉండబోతుంది అంటూ ఒక నటి ముందుగానే జోస్యం  చెప్పింది. మరి ఇంతకీ పూరి జగన్నాథ్ భవిష్యత్ గురించి ముందుగానే చెప్పిన ఆ నటి ఎవరో ఇప్పుడు చూద్దాం.  ఒకప్పుడు చిన్న హీరోలను స్టార్ హీరోలుగా మలిచిన పూరి జగన్నాథ్ కి ప్రస్తుతం సినిమాలు చేద్దామన్నా కూడా చిన్న హీరోలు కూడా డేట్స్ ఇచ్చే పరిస్థితిలో లేరు.

మహేష్ బాబు, రవితేజ,పవన్ కళ్యాణ్ వంటి ఎంతోమంది హీరోలను స్టార్లుగా మలిచిన పూరి జగన్నాథ్ కి స్టార్ హీరోలు మోహం చాటేస్తున్నారు. ఈయన చేసిన మోస్ట్ ఆఫ్ ది సినిమాలు ఈ మధ్యకాలంలో అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో పూరి జగన్నాథ్ తో వర్క్ చేయడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు.దాంతో పూరి జగన్నాథ్ పక్క ఇండస్ట్రీలో ఉండే హీరోలను వెతుక్కోవాల్సి వస్తుంది. ఈ విషయం పక్కన పెడితే..పూరి జగన్నాథ్ గురించి ఓ ఇంటర్వ్యూలో నటి హేమ మాట్లాడుతూ.. పూరి జగన్నాథ్ ని ప్రస్తుతం ఛార్మి అనే మేఘం కమ్మేసింది.ఆ మేఘాలను పూరి జగన్నాథ్ తొలగించుకోకుంటే ఆయన భవిష్యత్ మొత్తం నాశనమే. సినిమాలు హిట్ అవ్వవు.

కెరీర్ ముందుకు సాగడం చాలా కష్టం అవుతుంది అంటూ చెప్పుకొచ్చింది. అయితే పూరి జగన్నాథ్ పెళ్లిని దగ్గరుండి చేసిన హేమ ఎందుకు ఈ మాటలు మాట్లాడిందో తెలియదు కానీ చార్మి వల్లే పూరీ జగన్నాథ్ తన భార్యకు దూరంగా ఉంటున్నారు అనే కోపంతో హేమ ఈ మాటలు మాట్లాడినట్టు తెలుస్తోంది. లావణ్య పూరీల పెళ్లిని దగ్గరుండి చేసిన హేమ పూరి జగన్నాథ్ మరో అమ్మాయితో డేటింగ్ చేయడం నచ్చకే ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.ఏది ఏమైనప్పటికీ హేమ చెప్పినట్లే ఛార్మి పూరి జగన్నాథ్ తో ఉండడం వల్లే ఆయన చేసిన సినిమాలు అన్నీ ప్లాప్ అవుతున్నాయి అంటూ పూరి జగన్నాథ్ అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: