
ఆ రోజుల్లోనే థియేటర్లలో ఈ సినిమా మంచిగా ఆడింది. ఈ మూవీ మంచి టాక్ ని కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని పాత్రలకు నాని, మాళవిక, విజయ్ దేవరకొండ ప్రాణం పొసరనే చెప్పాలి. వీరి నటన మాత్రం చాలా అద్బుతంగా ఉంటుంది. ఈ సినిమాలో నాని సుబ్రమణ్యం పాత్ర పోషించాడు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నాని తనని తాను అన్వేషించుకోవడానికి చేసిన ఓ ప్రయణమే ఈ సినిమా. ఈ సినిమాను ప్రియాంక దత్ నిర్మించారు.
అయితే ఈ సూపర్ సినిమా వచ్చి పదేళ్ల అవుతుంది. ఈ సినిమా మరోసారి థియేటర్ లలో రిలీజ్ కానుంది. ఈ నెల 21న ఈ సినిమా రీరిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఇటీవలే నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. 'ఇలాంటి సినిమా ఇప్పుడు చేయడం కష్టం. కొన్ని సినిమాలు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతాయి. అలాంటి సినిమా ఇది.. ఈ సినిమాకు మళ్లీ అందరూ కనెక్ట్ అవుతారు. ఈ సినిమాలోని సుబ్రమణ్యం పాత్రలో అందరూ జీవిస్తారు' అని చెప్పుకొచ్చారు. ఎవడే సుబ్రమణ్యం సినిమాను థియేటర్ లో చూడడం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.