మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ చిన్నదాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తమన్నా తాను సినిమాల్లోకి వచ్చిన సమయంలోనే ఎనలేని గుర్తింపు అందుకుంది. తన నటన, అందానికి ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అవుతారు. కాగా, ఈ చిన్నది దాదాపు సినీ ఇండస్ట్రీకి పరిచయమై 20 ఏళ్లకు పైనే అవుతోంది. అయినప్పటికీ ఈ చిన్నది తన హవాను కొనసాగిస్తూ వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీ హీరోయిన్ గా సమయాన్ని గడుపుతోంది. 


ఇదిలా ఉండగా.... తమన్నా వయసు పెరిగినప్పటికీ ఇంతవరకు వివాహం చేసుకోకపోవడం విశేషం. అయితే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ చాలా కాలం నుంచి వారి రిలేషన్ కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ఈ సంవత్సరం వివాహం చేసుకుంటామని కూడా వెల్లడించారు. అయితే ఏమైందో తెలియదు గత కొన్ని రోజుల నుంచి తమన్నా, విజయ్ వర్మ బ్రేకప్ చెప్పుకున్నారంటూ అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.


అయితే వీటిపై తాజాగా తమన్నా స్పందించినప్పటికీ విజయవర్మ ఇంతవరకు బ్రేకప్ రూమర్స్ పై క్లారిటీ ఇవ్వలేదు. అంతేకాకుండా రీసెంట్ గా జరిగిన హోలీ సెలబ్రేషన్స్ ను విజయవర్మ సింగిల్గానే సెలబ్రేట్ చేసుకున్నాడు. దీంతో వీరి బ్రేకప్ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం... బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తమన్నాతో బ్రేకప్ చెప్పి మరో అమ్మాయితో రిలేషన్ కొనసాగిస్తున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.

అయితే మరో అమ్మాయితో విజయవర్మ క్లోజ్ గా ఉండడం వల్లనే తమన్నా, విజయ్ వర్మ విడిపోయారని టాక్ వినిపిస్తోంది. ఇక విజయ్ వర్మ తమన్నాను కాకుండా మరో అమ్మాయిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా సమాచారం అందుతుంది. అయితే ఈ మాటల్లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ బాలీవుడ్ సర్కిల్స్ లో ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ విషయం పైన తమన్నా, విజయవర్మ ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: