సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందే స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నది నటి సురేఖ వాణి కూతురు సుప్రీత.. నిరంతరం సోషల్ మీడియాలో సురేఖ సుప్రీత చేసేటువంటి గ్లామర్ విందు గురించి చెప్పాల్సిన పనిలేదు. నెక్స్ట్ లెవెల్ లో ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రస్తుతం సుప్రీత అమరదీప్ చౌదరితో కలిసి ఒక సినిమాలో నటిస్తూ ఉన్నది. ఇటీవలే హోలీ పండుగ సందర్భంగా తన ఫాలోవర్స్ ను సైతం సుప్రీత ఉద్దేశిస్తూ ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది.



అదేమిటంటే తాను తెలుసో తెలియక బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశానని ఇకపై  అలాంటి వాటిని ప్రమోట్ చేయకుండా దూరంగా ఉంటామని తెలిపింది. దయచేసి ఎవరూ కూడా ఇలాంటి పనులకు అలవాటు పడవద్దు మీరు కూడా వీరికి దూరంగా ఉండండి అంటూ మరొకసారి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయను అంటూ తెలియజేసింది. ఇటీవలే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న వారందరినీ కూడా సోషల్ మీడియా యూజర్స్ , యూట్యూబర్స్ సైతం హైదరాబాద్ పోలీసులు ఉక్కు పాదం మోపుతూ ఉన్నారు. అలా ఇప్పటికే లోకల్ బాయ్ నాని, హర్ష సాయి, విష్ణు ప్రియ, టేస్టీ తేజ, రీతూ చౌదరి , ఇతరత్రా వారి పేర్లు కూడా వినిపించాయి.


అయితే తాజాగా సురేఖ వాణి కూతురు సుప్రీత పైన పలు రకాల రూమర్స్ వినిపిస్తూ ఉండడంతో ఆమె తన ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోని రిలీజ్ చేసింది.సోషల్ మీడియాలో టీవీలో తన పైన వస్తున్న తప్పుడు వార్తలను ఎవరు నమ్మవద్దని వెల్లడించింది.. అలాగే తాను ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్లో ఉన్నానని మీరు ఎలాంటి ఆందోళనకు గురవ్వద్దు తాను సేఫ్ గా ఉన్నానంటూ తెలియజేసింది. మొత్తానికి అందుకు సంబంధించిన వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ఇప్పటికే చాలామంది కూడా బెట్టింగ్ యాప్స్ వైపు ఎవరు వెళ్లొద్దంటూ తెలియజేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: