దర్శక ధీరుడు రాజమౌళి,సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతుంది.. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది..బిగ్గెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు..ఈ మూవీ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు.. ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు స్టార్ట్ అయినా ఫ్యాన్స్ మాత్రం నిరాశలోనే వున్నారు.కారణం ఏమిటంటే ఇప్పటి దాకా జక్కన్న ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. మరోవైపు సైలెంట్ గా జనవరి నెల మొదట్లోనే ఈ మూవీ పూజా కార్యక్రమాలను మొదలు పెట్టి శర వేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు, వర్క్ షాప్, టెస్ట్ లుక్ వంటివి మొత్తం పూర్తి చేశారు.

 అంతేకాకుండా గుట్టు చప్పుడు కాకుండా నటీనటులను సెలెక్ట్ చేసి, ఒక్క లీక్ కూడా బయటకు రాకుండా షూటింగ్ ను కూడా చక చకా చేసేస్తున్నారు..తాజాగా ఈ సినిమా షూటింగ్ ఒడిశా లో జరుగుతుంది..అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో లీక్ కావడంతో చిత్ర యూనిట్ ఒక్కసారిగా అప్రమత్తం అయింది..షూటింగ్ పరిసరాల్లో కఠిన నియమాలు పెట్టింది..ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబందించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది..

తాజాగా ఒడిశా షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ తమకు గౌరవ ఆతిద్యాన్ని ఇచ్చినందుకు స్పెషల్ థాంక్స్ చెబుతూ రాజమౌళి రాసిన నోట్ వైరల్ అవుతుంది..అయితే ఈ నోట్ లో రాజమౌళి వర్కింగ్ టైటిల్ ని “SSMB29” అని మహేష్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు..త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి భారీ ప్రెస్ మీట్ ను నిర్వహించనున్నారు..ఆ ప్రెస్ మీట్ లో రాజమౌళిసినిమా గురించి కీలక విషయాలు తెలుపనున్నట్లు సమాచారం..









మరింత సమాచారం తెలుసుకోండి: