నిధి అగర్వాల్ ఈ పేరు ప్రస్తుతం నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఇరుక్కున్న వారిలో నిధి అగర్వాల్ పేరు కూడా వినిపిస్తోంది. త్వరలోనే ఈ హీరోయిన్ ని అరెస్ట్ చేస్తారంటూ సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా నిధి అగర్వాల్ ప్రేమ ముచ్చట్లు కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.మరి ఇంతకీ నిధి అగర్వాల్ ఎవర్ని  ప్రేమించింది అనేది ఇప్పుడు చూద్దాం.. తమిళ,తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న నిధి అగర్వాల్ ప్రస్తుతం ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది.అది ఒకటి పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు..మరొకటి ప్రభాస్ తో ది రాజా సాబ్.ఈ రెండు సినిమాలు హిట్ అయితే గనక నిధి అగర్వాల్ రేంజ్ మారిపోతుంది అని చెప్పుకోవచ్చు. 

అయితే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో అంత పేరున్న సినిమాల్లో నటించలేదు. ఇక తమిళంలో హీరోయిన్ గా కాస్త కూసో గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయిన్ తమిళ హీరోలలో ప్లే బాయ్ ఇమేజ్ సంపాదించిన నటుడు శింబుతో ప్రేమలో ఉందని చాలా రోజుల నుండి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ మధ్యకాలంలో ఈ వార్తలు వచ్చి వైరల్ అయినప్పుడు అదంతా ఏమీ లేదు. నేను కేవలం ఆయనతో సినిమా మాత్రమే చేసాను  రిలేషన్ లాంటిది ఏది లేదు అని కొట్టి పారేసింది.కానీ మరోసారి నిధి అగర్వాల్ శింబుల ప్రేమ వార్తలు కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.అయితే శింబుతో నిధి అగర్వాల్ ప్రేమలో ఉందని వీరిద్దరి ప్రేమ నిజమేనని ప్రేమ మాత్రమే కాదు ఇద్దరు డేటింగ్ కూడా చేస్తున్నారని శింబు ఇంటికి నిధి అగర్వాల్ ఈ మధ్యనే షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది.

అంతేకాదు నిధి అగర్వాల్ ఇంట్లో వాళ్ళు శింబుని అల్లుడుగా చేసుకోవడానికి అస్సలు ఒప్పుకోవడం లేదట. దాంతో శింబు తల్లిదండ్రులనైనా ఒప్పించి ఈ పెళ్లి చేసుకుందామని నిధి శింబు ఇంటికి మకాం మార్చినట్టు తెలుస్తోంది. అయితే శింబుకి ఇప్పటికే కోలీవుడ్లో ఎంతోమంది హీరోయిన్లతో ఎఫైర్ వార్తలు వినిపించాయి.ఈ కారణంతోనే తన కూతురు జీవితం కూడా నాశనం కావొద్దు అని నిధి అగర్వాల్ పేరెంట్స్ ఆయనతో పెళ్లికి అస్సలు ఒప్పుకోవడం లేదట.కానీ నిధి అగర్వాల్ మాత్రం శింబునే పెళ్లి చేసుకుంటానని పట్టు పట్టడంతో పేరెంట్స్ నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని సైలెంట్ అయిపోయారట. దాంతో నిధి అగర్వాల్ శింబు పేరెంట్స్ ని ఒప్పించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి నిజంగానే శింబు నిధి అగర్వాల్ ప్రేమించుకున్నారా.. కోలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఉన్న నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: