కొంత కాలం క్రితం మ్యాడ్ అనే మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సాధించిన విషయం మనకు తెలిసిందే. ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. దానితో ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ ను విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ సినిమా విడుదల అయిన కొన్ని రోజులకే ఈ మూవీ కి కొనసాగింపుగా మ్యాడ్ స్క్వేర్ అనే మూవీ ని రూపొందించబోతున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు.

ఇప్పటికే మ్యాడ్ స్క్వేర్ మూవీ ని రూపొందించారు. ఈ మూవీ ని మార్చి 28 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన రన్ టైమ్ ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ 2 గంటల 7 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఇకపోతే మంచి విజయం అందుకున్న మ్యాడ్ మూవీ కేవలం 2 గంటల 4 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక మ్యాచ్ స్క్వేర్ మూవీ మ్యాడ్ మూవీ కంటే 3 నిమిషాల ఎక్కువ నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇకపోతే మ్యాడ్ మూవీ మంచి విజయం సాధించి ఉండడంతో మ్యాడ్ స్క్వేర్ మూవీ పై ప్రస్తుతం ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: