సీనియర్ నటి మీనా చిన్న పిల్ల లాగా ఇప్పటికీ చాలా క్యూట్ గా కనిపిస్తుంది. ఆమె ఏజ్ పెరిగినా కూడా అందంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. సీనియర్ హీరోయిన్ అంటే ఎవరు నమ్మరు. కాస్త సన్నగా అయితే చాలు ఇప్పటి హీరోయిన్లకు పోటీ ఇవ్వడం ఖాయం. ఇక సినిమాల్లో హీరోయిన్గా ఒకప్పుడు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మదర్ క్యారెక్టర్లలో కీ రోల్స్ పోషిస్తుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ సీనియర్ హీరోలకు భార్యాపాత్రల్లో నటించడానికి రెడీగా ఉంది.అలా వెంకటేష్ తో దృశ్యం, దృశ్యం -2 వంటి సినిమాల్లో చేసింది. అయితే అలాంటి సీనియర్ నటి మీనా కి ఆ హీరో గడగడలాడి పోతారట.అందరిని భయపెట్టించే ఆ హీరో కేవలం మీనాకి భయపడతారంటూ ఈ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. నటి మీనా రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను చాలామంది తెలుగు హీరోలతో నటించాను.

 అలా వెంకటేష్, బాలకృష్ణ, మోహన్ బాబు, చిరంజీవి ఇలా ఎంతోమందితో స్క్రీన్ షేర్ చేసుకున్నాను.వీరందరిలో వెంకటేష్ తో నాకు మంచి ర్యాపో ఉంది.ఆయనతో మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది. అలాగే  చిరంజీవి తో కూడా నాకు మంచి అనుబంధం ఉంది.ఇక బాలకృష్ణ గారు మాట్లాడిన మాట్లాడకపోయినా ఆయన మాత్రం మాట్లాడుతూనే ఉండేవారు. ఇక వీరందరి కంటే మోహన్ బాబు చాలా డిఫరెంట్. ఆయన్ని చూస్తే నాకు భయమేసేది.ఆయన మాటలే బెదిరించినట్లుగా ఉండేవి. ఇక మోహన్ బాబు గారితో నేను అల్లరి మొగుడు సినిమా చేశాను. కానీ ఆ టైంలో నా ఏజ్ చాలా చిన్నది. షూటింగ్ సెట్ కి వచ్చిన మంచు లక్ష్మీ, విష్ణు లతో నేను ఆడుకునేదాన్ని.అయితే ఆ టైంలో మోహన్ బాబు గారు నాపై చాలా పంచులు వేసేవారు. కానీ నా మీద జోక్స్ వేస్తున్నారు అని కూడా తెలియని పరిస్థితి నాది.

ఆ టైంలో నేను చిన్నదాన్ని కాబట్టి ఆయన వేసిన జోకులు కూడా నాకు అర్థం అయ్యేవి కావు. ఇక ఆయన షూటింగ్ సెట్ కి రావడంతోనే చాలా గంభీరంగా అందర్నీ బెదిరించినట్టుగా ఇటు రారా అటు పోరా అంటూ మాట్లాడేవారు. దాంతో ఆయన్ని చూసి భయపడేదాన్ని. అయితే మిగతా హీరోలు ఎవరు కూడా ఈయనలా చేసేవారు కాదు. అయితే బయటికి ఎలా ప్రవర్తించినా కూడా ఆయన మంచి మనిషి.నా ప్రొఫెషనలిజం చూసి ఆయన నాకు భయపడేవారు.నాతో మాత్రం బాగా కలిసిపోయి మాట్లాడేవారు. ఆయనతో కూడా నాకు మంచి బాండింగ్ పెరిగింది అంటూ సీనియర్ నటి మీనా చెప్పుకొచ్చింది. అయితే అందరినీ భయపెట్టించే మోహన్ బాబు మీనా కి మాత్రం భయపడి పోయేవారా అంటూ మీనా మాటలు విన్న నెటజన్లు కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: