తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్న వారిలో రామ్ పోతినెని ఒకరు. రామ్ ఈ మధ్య కాలంలో వరుస పెట్టి భారీ అపజయాలను ఎదుర్కొంటూ వస్తున్నాడు. కొంత కాలం క్రితం రామ్ "ది వారియర్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ అపజయాన్ని ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత ఈయన నటించిన స్కంద , డబుల్ ఇస్మార్ట్ మూవీలు కూడా వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇలా ప్రస్తుతం వరుస అపజయాలతో డీలా పడిపోయి ఉన్నా రామ్ ప్రస్తుతం మిస్ శెట్టి మిస్టర్ శెట్టి మూవీ దర్శకుడు అయినటువంటి మహేష్ బాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ కి ఇప్పటి వరకు మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో రాపో 22 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ.ని రూపొందిస్తూ వస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ బృందం వారు రాజమండ్రిలో ఓ షెడ్యూల్ ను మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా ఈ మూవీ బృందం వారు రాజమండ్రి షెడ్యూల్ ను పూర్తి చేస్తున్నట్టు తెలుస్తుంది. రాజమండ్రిలో ఈ మూవీ బృందం వారు 33 రోజుల భారీ షెడ్యూల్ ను అత్యంత భారీ ఎండల్లో పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఈ మూవీ బృందం వారు తదుపరి షెడ్యూల్ ని హైదరాబాదులో మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. రామ్ ఆఖరుగా నటించిన ది వారియర్ , స్కంద , డబుల్ ఇస్మార్ట్ మూడు సినిమాలు కూడా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ లను అందుకున్నాయి.

ఇక ప్రస్తుతం రామ్ , మహేష్ బాబు దర్శకత్వంలో నటిస్తున్న సినిమా పక్క క్లాస్ ఎంటర్టైనర్ మూవీ అని ఈ మూవీ పోస్టర్స్ ద్వారా అర్థం అవుతుంది. మరి చాలా కాలం తర్వాత రామ్ క్లాస్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి వరుస ఆపజయలతో డీలా పడిపోయిన రామ్మూవీ తో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: