
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటన, అందంతో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. అలాంటి వారిలో నటి సమంత ఒకరు. ఈ చిన్నది ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమాలో తన నటన, అందానికి ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు. ఆ సినిమా అనంతరం సమంత ప్రేక్షకులలో ఎనలేని గుర్తింపును దక్కించుకుంది.
ఏమాయ చేసావే సినిమా తర్వాత వరుసగా సినిమాలలో నటించి అగ్ర హీరోయిన్ గా తన హవాను కొనసాగించింది. ఇక ఈ చిన్నది తన మొదటి సినిమాను అక్కినేని నాగచైతన్యతో కలిసి నటించింది. ఆ సినిమా సమయంలోనే నాగచైతన్య, సమంత మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో కొన్ని సంవత్సరాల పాటు వీరిద్దరూ సీక్రెట్ గా వారి ప్రేమ విషయాన్ని కొనసాగించారు. అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహాన్ని జరుపుకున్నారు.
కానీ వారి వైవాహిక జీవితంలో ఏవో కొన్ని మనస్పర్ధల కారణంగా అతి తక్కువ సమయంలోనే విడాకులు తీసుకున్నారు. కానీ ఈ జంట రిలేషన్ కొనసాగిస్తున్న సమయంలో చాలా సంతోషంగా ఉన్నారు. వారి ప్రేమకు గుర్తుగా సమంత, నాగచైతన్య వారి చేతులపై టాటూను కూడా వేసుకున్నారు. అయితే అది వేరే భాషలో ఎవరికి అర్థం కాకుండా ఒకరి పేరును మరొకరు టాటూ రూపంలో చేతిపై వేసుకున్న సంగతి తెలిసిందే. అయితే విడాకుల అనంతరం నాగచైతన్య నటి శోభితను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కానీ సమంత ఇప్పటికీ సింగిల్ గానే ఉంది.
అయితే ఈ క్రమంలోనే సమంత తన చేతిపై చైతు పేరుతో ఉన్న టాటూను తొలగించిందట. ఈ విషయం తెలిసి కొంతమంది పలు రకాలుగా స్పందిస్తున్నారు. చైతు పేరును తొలగించిందంటే సమంత లైఫ్ లోకి కొత్త వ్యక్తి వచ్చాడేమోనని కొంతమంది అంటున్నారు. సమంత మళ్ళీ వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా పలు రకాలుగా వార్తలు వైరల్ చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఈ విషయం హాట్ టాపిక్ అవుతోంది. ఈ విషయం పైన సమంత ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం తెలియదు. కాగా, ప్రస్తుతం సమంత వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతోంది.