సాధారణంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవరిని ఏది రిక్వెస్ట్ చేయరు.  అలా రిక్వెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎదుటి వాళ్ళు ఆ పని చేసే తీరుతారు. ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలోనే ఇలా మాట్లాడుకునే వారు జనాలు . అయితే కొన్ని కొన్ని సార్లు మాత్రం కొందరు పవన్ ఆఫర్ ని రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి . మరీ ముఖ్యంగా ప్రజెంట్ ఏపీ డిప్యూటీ సీఎం గా తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గతంలో సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరో . ఎంత పెద్ద హీరో అంటే సినిమా ఇండస్ట్రీని సింగిల్ హ్యాండ్ తో గజగజ వణికించేశాడు.


అన్న పెద్ద మెగాస్టార్ చిరంజీవి అయినా సరే ఆయన పలుకుబడిన ఏ మాత్రం ఉపయోగించుకోకుండా పవన్ కళ్యాణ్ ఎలా తన హవా కొనసాగించాడు అనేది మనందరికీ తెలుసు. కాగా పవన్ కళ్యాణ్ కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా భీమ్లా నాయక్ . ఈ సినిమాలో విలన్ షేడ్స్ లో కనిపిస్తాడు రానా దగ్గుబాటి . నిజానికి ఈ సినిమాలో విలన్ షేడ్స్ పాత్ర కోసం ముందుగా హీరో సూర్యను అనుకున్నారట.  అయితే పవన్ కళ్యాణ్ కూడా సూర్యతో నటించాలి అని ఉంది అన్న ఆశతో స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా రిక్వెస్ట్ చేశారట .



అయినా సరే పవన్ కళ్యాణ్ కూడా నోరు తెరిచి ఈ సినిమాలో నటించండి అంటూ అడిగిన కానీ సూర్య మాత్రం వేరే సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నాను కాల్ షీట్స్ లేవు అంటూ సున్నితంగానే ఆఫర్ ని తిరస్కరించారట.  ఇష్టం ఒకపక్క కెరియర్ ని ఒకపక్క పెట్టి చూసే టైప్ సూర్య . అందుకే పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టం ఉన్నా కూడా తాను కమిట్ అయిన సినిమాకి అన్యాయం చేయకూడదని ఇష్టమైన హీరో సినిమా ని కూడా వదిలేసుకున్నాడు సూర్య అంటూ జనాలు మాట్లాడుకున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: