టాలీవుడ్లో పోకిరి సినిమాలో ఇప్పటికింకా నా వయసు నిండా 16 అనే పాటతో కుర్రకారుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంది నటి ముమైత్ ఖాన్.. ఈమె స్పెషల్ సాంగ్లలో, స్పెషల్ క్యారెక్టర్లలో అటు తెలుగు, తమిళ్, హిందీ వంటి భాషలలో కూడా నటించింది. అయితే ఆ తర్వాత పలు చిత్రాలలో హీరోయిన్గా కూడా నటించిన సక్సెస్ కాలేక పోయింది. 2019లో ఆడపా దడపా చిత్రాలలో నటిస్తున్న ముమైత్ ఖాన్ 2022 తర్వాత మళ్లీ ఇప్పుడు కమ్ బ్యాక్ ఇస్తోంది.


ఇటీవలే హైదరాబాదులో మేకప్ హెయిర్ అకాడమీ కూడా మొదలుపెట్టిన ముమైత్ ఖాన్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ తాను ఇన్నేళ్లు ఎందుకు దూరం అయ్యానని విషయాన్ని తెలియజేసింది.. ముమైత్ ఖాన్ మాట్లాడుతూ తాను ఇంట్లో ఒకసారి డాన్స్ వేసుకుంటూ ఉన్న సమయంలో కాళ్లు స్లిప్పయి పడిపోయానని.. తన తల బెడ్డుకు తగిలిందని.. అయితే బ్లడ్ బయటికి రాలేదు కానీ లోపల ఏదో జరిగిందని విషయం తనకు అర్థం అయ్యిందని.. దీంతో అమ్మ తనని హాస్పిటల్ కి తీసుకువెళ్లిందని తెలిపింది ముమైత్ ఖాన్.


అయితే వైద్యులు స్కానింగ్ చేసిన తర్వాత సీరియస్ అన్నారు తలలో మూడు నరాలు కట్టయ్యాయని చెప్పారట. ఇక బాంబేలోని ఒక హాస్పిటల్లో సర్జరీ కూడా చేయించుకున్నానని అలా 15 రోజులపాటు కోమాలో ఉన్నారని.. 15 రోజుల తర్వాత తాను కోమా నుంచి బయటికి వచ్చిన తర్వాత మెమొరీ లాస్ అయ్యానని చాలా విషయాలు గుర్తు పట్టలేకపోయానని అవి గుర్తుకు తెచ్చుకోవాలని చాలా ప్రయత్నించిన ఎంతో ఒత్తిడిగా అనిపించేదని తెలిపింది.. ఇప్పటికీ కొన్ని విషయాలు తనకి గుర్తుకు రాలేవని తెలియజేసింది ముమైత్ ఖాన్.. అయితే ఈ విషయం విన్న అభిమానులు ఆరోజు తన ఇంట్లో జరిగిన ఈ తప్పు ముమైత్ ఖాన్ కి మెమొరీ లాస్ అయ్యేలా చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.. అయితే ప్రస్తుతానికైతే తన ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: