
ఇప్పుడు కాంట్రవర్షియల్ హీరోయిన్ ప్రత్యూష బయోపిక్ లో నటించడానికి ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . నిజానికి ప్రత్యూష బయోపిక్ లో చాలామంది హీరోయిన్స్ నటించడానికి భయపడ్డారు. మరి ముఖ్యంగా లావణ్య త్రిపాఠి అదే విధంగా రష్మిక మందన్నా లాంటి స్టార్ హీరోయిన్స్ పేర్లు కూడా ఈ లిస్టులో వినిపించాయి. కానీ రష్మిక మందన్నా - లావణ్య త్రిపాఠి ఇది పొలిటికల్ నేపథ్యంగా కూడా ఉండడంతో ఇలాంటి పాత్రలో నటించడానికి భయపడ్డారు. మనకు తెలిసిందే ప్రత్యూష మరణం ఓ మిస్టరీ గానే ఉంది. ఇందులో పొలిటీషియన్స్ పిల్లల్లు కూడా ఇన్వాల్వ్ అయ్యారు.
ఫైనల్లీ సాయి పల్లవి మాత్రం ఏ భయం బెరుగు లేకుండా .. ఇలాంటి పాత్రలో నటించడానికి ఓకే చేసిందట. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రిలో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా టృఎండ్ అవుతూ వైరల్ గా మారింది . త్వరలోనే హీరోయిన్ ప్రత్యూష బయోపిక్ లో సాయి పల్లవి నటించబోతుంది అనే విషయం అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారట . దీంతో ఇప్పుడు మళ్లీ తెరపైకి ప్రత్యూష లైఫ్ హిస్టరీ కి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి. నిజంగా ఇది నిజం అయితే మాత్రం సాయి పల్లి కెరీర్ కి ఇక తిరుగుండదు..!!