పాపం మహేష్ బాబు ఏ ముహూర్తన రాజమౌళితో సినిమాకి కమిట్ అయ్యాడో తెలియదు కానీ అప్పటినుంచి మహేష్ బాబు పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నా కూడా అదే విధంగా ట్రోలింగ్ కి గురి అవుతుంది . రీజన్ ఏంటో తెలియదు కానీ మహేష్ బాబు రాజమౌళి సినిమాల గురించి పాజిటివ్ కామెంట్స్ కన్నా నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.  మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సినిమా షూట్ సెట్స్ నుంచి లీకైన పిక్స్ రాజమౌళికి కొత్త తలనొప్పులే క్రియేట్ చేసేలా మారాయి .


సినిమాకి పబ్లిసిటీ పాపులారిటీ వస్తున్న మరొకపక్క సినిమాకి నెగిటివ్ టాక్ కూడా వస్తుంది అంటూ భయపడిపోతున్నారు. అయితే ఇప్పుడు సినిమా సెట్స్ నుంచి మహేష్ బాబు పిక్స్ లీక్ అవ్వకుండా మహేష్ బాబు లుక్స్ అస్సలు రివిల్ కాకుండా రాజమౌళి సెన్సేషనల్ డెసీషన్ తీసుకున్నారట . అంతేకాదు ఇప్పుడు రాజమౌళి తీసుకున్న డెసిషన్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తుంది . మహేష్ బాబు ఇంకా ఎక్కడ కూడా బయట ఫంక్షన్స్ కి అటెండ్ అయ్యే దానికి లేదు.. ఆయన పిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే దానికి లేదు .. ఎక్సెప్ట్ నమ్రత - సితార - గౌతమ్ తప్పిస్తే ఆయనతో వీడియో కాల్ మాట్లాడే అందుకు ఎవరికీ రైట్ లేదు.



మహేష్ బాబు లుక్స్ రాజమౌళి రివీల్  చేసే వరకు ఆయన లుక్స్ ఆయన కూడా బయట పెట్టే దానికి లేదు. ఈ విధంగానే రాజమౌళి మహేష్ బాబుకు కండిషన్ పెట్టారట.  ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది . సొంత భార్యతో కూడా ఎక్కడికి వెళ్లలేనటువంటి కండిషన్స్ పెట్టేసావు.. ఇదేంటి అంటూ రాజమౌళి పై కొంతమంది మండిపడుతున్న.. ఆయన ఈ సినిమా కోసం కష్టపడుతున్న తీరు చూసి నిజమే ఆయన కష్టానికి తగ్గ ఫలితం రావాలి అంటూ ఈ సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి: