- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ... మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా దేవర‌. ఈ సినిమా గురించి అంద‌రికి తెలిసిందే. గ‌తేడాది తెలుగు సినిమా నుంచి వ‌చ్చిన భారీ గ్రాస‌ర్ సినిమా ల‌లో దేవ‌ర ఒక‌టిగా నిలిచింది. గ‌తేడాది తెలుగు సినిమా నుంచి ఇంత భారీ గ్రాస్ వ‌చ్చిన సినిమాల లో ఒక‌టిగా నిలిచిన దేవ‌ర బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఏకంగా రు. 400 కోట్ల కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇక దేవ‌ర సినిమాకు సీక్వెల్ గా తెర‌కెక్కే దేవ‌ర 2 సినిమా ను కూడా ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ తెర‌కెక్కించే ప్లాన్ లో ఉన్నారు.


ఇక దేవ‌ర సినిమాని మేకర్స్ పాన్ ఇండియా రిలీజ్ తర్వాత జపాన్ మార్కెట్ లో కూడా ఇపుడు రిలీజ్ కి తీసుకు వెళుతున్న‌ సంగతి తెలిసిందే. ఇక జ‌పాన్ లో దేవ‌ర సినిమా మార్చ్ 27న గ్రాండ్ గా రిలీజ్ చేస్తుండగా అక్కడ ఇపుడు వేసిన పలు ప్రీమియర్స్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చినట్టుగా స‌మాచారం. దీంతో దేవ‌ర సినిమా అక్క‌డ రిలీజ్ కు ముందే బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తో సాలిడ్ హిట్ రెస్పాన్స్ తెచ్చుకుంద‌నే చెప్పాలి.


ఇక ఈ సినిమా లో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టించ‌గా ...  అనిరుద్ ర‌విచంద్ర‌న్‌ సంగీతం అందించగా ఎన్టీఆర్ ఆర్ట్స్ - యువసుధ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే. ఇక దేవ‌ర సీక్వెల్ దేవ‌ర 2 మీద ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ తీవ్ర క‌స‌ర‌త్తు లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: