
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ... టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా అతడు. 2005 లో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ సినిమా లో మహేస్ బాబుకు జోడీగా త్రిష హీరోయిన్ గా నటించింది. ఇక దర్శకుడిగా త్రివిక్రమ్ కు ఇది రెండో సినిమా. తొలి సినిమా నువ్వే నువ్వే తో తరుణ్ - శ్రీయ హీరోగా తెరకెక్కించి హిట్ కొట్టిన త్రివిక్రమ్ అతడు సినిమా తోనూ దర్శకుడిగా తన ప్రతిభతో మెప్పించాడు. అయితే ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ విషయం బయటకు వచ్చింది.
ఈ సినిమాకు దర్శకత్వం చేస్తున్నప్పుడు ఏ సీన్ కి ఏ లెన్స్ వాడాలో తెలియక తికమక పడ్డాను అని త్రివిక్రమ్ బహిరంగంగానే వేదిక మీద చెప్పాడు. మురళీ మోహన్ నిర్మాత. ఆయన తన జయభేరి ఆర్ట్స్ బ్యానర్ మీద భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. అలా అనడం కంటే అనుకున్న షెడ్యూల్ కంటే ఎక్కువ సమయం తీసుకోవడం తో బడ్జెట్ తడిసి మొపెడు అయ్యింది అని మురళీ మోహన్ మొత్తుకున్నాడు. ఈ విషయం లో మురళీ మోహన్ ఇప్పటకీ అసంతృప్తి తోనే ఉంటారు.
ఇక సినిమా ఎవరేజ్ గా కలెక్షన్లు రావడంతో సాటిలైట్ హక్కులు చాలా తక్కువకి అమ్మాడు మురళీమోహన్! కానీ అతడు ఎన్ని సార్లు టెలికాస్ట్ చేసి నా వీక్షకుల సంఖ్య తగ్గడంలేదు! మురళీమోహన్ కంటే హక్కులు కొన్నవాళ్ళకే ఎక్కువ లాభాలు వచ్చాయి .. ఇంకా వస్తూనే ఉన్నాయి. అలా మహేష్ బాబు కెరీర్ లో వెండి తెరపై ఫట్ అయినా బుల్లి తెరపై బ్లాక్ బస్టర్ అయిన సినిమా గా అతడు రికార్డుల్లో నిలిచి పోయింది.