
ఈ కేసు కు సంబంధించి గత కొద్దిరోజులుగా జైలు జీవితాన్ని కూడా గడిపింది హేమ. ఆ తర్వాత బెయిల్ మీద బయటకి వచ్చి పలు రకాల ఇంటర్వ్యూలలో పాల్గొని తాను నిర్దోషినంటూ చెప్పుకొచ్చింది. అయినప్పటికీ కూడా హేమ పైన చాలా వరకు నెగెటివిటీ బయటికి రావడం జరిగింది. 2021 లో క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో కనిపించిన హేమ.. గేమ్ ఛేంజర్ చిత్రంలో ఒక చిన్న పాత్రలో కనిపించింది. మరే సినిమాలో కూడా హేమ కనిపించలేదు. తాజాగా ఇటీవలే హైదరాబాదులో ఒక షాపు ఓపెనింగ్ లో హేమ సినిమాలలో ఎప్పుడు కనిపిస్తారని ప్రశ్నించగా..
అందుకే హేమ ఇలా ఆసక్తికరమైన సమాధానాన్ని తెలియజేస్తూ తాను సినిమాలలో నటించడం మానేశానని ఇప్పుడు తన లైఫ్ని ఎక్కువగా చిల్ చేస్తున్నానని హ్యాపీగా ఉన్నానని జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నానని తెలిపింది. తన 14వ ఏట నుంచి తాను కష్టపడుతున్నానని ఇక కష్టపడిందేది చాలు ఇంకెంతకాలం కష్టపడాలి ఎవరి కోసం కష్టపడాలి నాకోసం నేను హ్యాపీగా ఉండడానికి వీలైనంతగా ప్రయత్నిస్తున్నారంటే తెలిపింది.. ఒకవేళ రాబోయే రోజుల్లో తనకి బోర్ కొట్టి యాక్టింగ్ చేయాలనుకుంటేనే అప్పుడు సినిమాల సంగతి చూస్తానని ఇప్పటికైతే శివగామి వంటి పాత్రలు వచ్చిన తాను నటించను అంటూ తెలియజేసింది హేమ. హేమ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.