
ఇదిలా ఉండగా.. ఒక సూపర్ హిట్ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవ్వనుంది. టాలీవుడ్ హీరో నవదీప్, కన్నడ హీరో దీక్షిత్ శెట్టి టచ్ మీ నాట్ అనే సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ఈ సిరీస్ ఒక క్రైమ్ థ్రిల్లర్. టచ్ మీ నాట్ సినిమా డైరెక్టర్ రమణ తేజ దర్శకత్వంలో విడుదల కానుంది. అయితే ఈ సిరీస్ జియో హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అవ్వనుంది. ఈ సిరీస్ వచ్చే నెల 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సిరీస్ టైలర్ ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ సిరీస్ టైలర్ ఎంతో మందిని ఆకట్టుకుంది. కొన్నిటిని ప్రాణం కన్నా ఎక్కువగా కాపాడుకోవాలి అని ఈ టైలర్ ద్వారా చూపించారు. ఇక ఈ సిరీస్ కోసం నెటిజన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ మధ్య కాలంలో సినిమాల కన్నా కూడా ప్రేక్షకులు సిరీస్ లనే ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. చాలా మంది ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో సబ్స్క్రిప్షన్ ని కొనుగోలు చేసి మరి చూస్తున్నారు. సినిమాల కంటే కూడా సిరీస్ లు చాలా మంచి మెసేజ్ ని అందిస్తున్నాయి. చాలా డిఫరెంట్ గా కూడా ఉంటున్నాయి.