నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ చిన్నది చలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే తనదైన నటన, అందంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమా అనంతరం వరసగా సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఆగ్ర హీరోయిన్ గా రాణిస్తోంది. ఇప్పుడు ఏకంగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగిపోయింది.


ఇక ఈ సినిమా అనంతరం ఈ చిన్నది వరుసగా సినిమాలు చేసుకుంటూ ఆగ్ర హీరోయిన్ గా తన హవాను కొనసాగిస్తోంది. పుష్ప సినిమా అనంతరం పుష్ప-2 సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాకుండా రీసెంట్ గా ఈ చిన్నది నటించిన చావా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది. దీంతో రష్మిక అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ చిన్నది వరుసగా సినిమా ప్రాజెక్ట్స్ లలో నటిస్తూ బిజీగా తన సమయాన్ని గడుపుతోంది. అంతేకాకుండా సినిమాలలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో విపరీతంగా యాక్టివ్ గా ఉంటుంది.


తనకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోవడమే కాకుండా సమయం దొరికినప్పుడల్లా అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ చిన్నది తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసుకుంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు సో క్యూట్ అని కామెంట్లు పెడుతున్నారు. ఆ వీడియోలో రష్మిక తన ఫేవరెట్ స్వీట్ తింటూ వీడియో షేర్ చేసుకుంది. అంతేకాకుండా ఆ వీడియో కింద ఈ పని చేయకుండా నన్ను ఎవరు ఆపలేరు అని రాసుకోచ్చింది. అంతే కాకుండా ఐ లవ్ అని ఎమోజిని షేర్ చేసుకుంది.


ఇది చూసి రష్మికకు ఈ స్వీట్ అంటే చాలా ఇష్టమేమో అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం ఈ బ్యూటీ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే చాలా కాలం నుంచి వీరిద్దరిపై అనేక రకాల రూమర్స్ వస్తున్నప్పటికీ రీసెంట్ గా ఈ విషయం పైన ఇన్ డైరెక్ట్ గా రష్మిక స్పందించారు. ఈ విషయం తెలుసునా అనకరం రష్మిక, విజయ్ దేవరకొండ అభిమానులు సంబరపడుతున్నారు. వీరి జంట చాలా క్యూట్ గా ఉంటుందని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేలా ఉంటారని అంటున్నారు. ఇక ఈ జంట ఎప్పుడు వివాహం చేసుకుంటారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: