
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో ఆ 20 నిమిషాలు వైల్డ్ ఫైర్ అటాక్ సీన్ ఉంటుందని తెలుస్తోంది. ఆ సీన్ కి థియేటర్స్ మొత్తం షేక్ అయిపోవాల్సిందే అంటూ టాక్ వినిపిస్తుంది. ఎస్ఎస్ఎంబి 29 సినిమా కోసం ఏళ్లుగా ఫాలో అవుతున్న సెంటిమెంట్ ని కూడా మహేష్ బాబు బ్రేక్ చేశాడని అందరికీ తెలిసిందే. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 1000 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో తెరకెక్కనున్న SSMB29పై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే ఈ సినిమా హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా సినిమా షూటింగ్ లో భాగం అయినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ప్రియాంక చోప్రా సోషల్ మీడియా వేదికగా హోలీ పండుగ రోజు కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ప్రియాంక, మహేష్ బాబు, జకన్నతో ఒడిశాలోని కోరాపుట్ లో షూటింగ్ సెట్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎస్ఎస్ఎంబీ 29 ఒడిశా షెడ్యూల్ ఫినీష్ అయ్యింది. రాజమౌళి కోరాపుట్ హాస్పటలిటీకి దాన్యవాదాలు తెలిపుతూ నోట్ రాశారు. ఇక అక్కడి అధికారులు, అభిమానలతో కలిసి దిగిన ఫోటోస్ కూడా వైరల్ అవుతున్నాయి. దీంతో అక్కడ షూట్ పూర్తయ్యింది మరి నెక్స్ట్ ఏంటి జకన్న అంటూ కామెంట్స్ పెడుతున్నారు.