ఈ మధ్యకాలంలో ఇది ఒక  ట్రెండ్ గా మారిపోతుంది . ఏ హీరో హీరోయిన్ పెళ్లి చేసుకున్న .. ప్రేమించి పెళ్లి చేసుకున్న .. లేకపోతే పెద్దలు కుదిర్చిన విధంగా పెళ్లి చేసుకున్న వెంటనే ఆ హీరో హీరోయిన్  ని పెట్టి తెరపై ఒక సినిమాలో కనిపించే విధంగా మూవీ చేస్తూ ఉంటారు డైరెక్టర్స్.  మరి కొంతమంది డైరెక్టర్ లు దీని గురించే కాచుకొని కూర్చుని ఉంటారు.  కాగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి హీరో వరుణ్ తేజ్ ల పేర్లు మారుమ్రోగి పోతున్నాయి . 


హీరోయిన్ లావణ్య త్రిపాఠి - వరుణ్ తేజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే . వీళ్ళ ప్రేమాయణం అస్సలు బయటకు రాకుండా చాలా చాలా జాగ్రత్త పడ్డారు . నిశ్చితార్థం చేసుకుని తమ ప్రేమ విషయాన్ని పెళ్లి విషయాన్ని అఫీషియల్ గా బయటపెట్టారు . కాగా  ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మరొకసారి హీరోయిన్ లావణ్య త్రిపాఠి హీరో వరుణ్ తేజ్ ల  పేర్లు బాగా ట్రెండ్ అవుతున్నాయి . దానికి కారణం వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమాలో కనిపించబోతున్నారట .



గతంలో నాగచైతన్య - సమంత కూడా ఇదేవిధంగా పెళ్లి తర్వాత "మజిలీ" అనే సినిమాలో నటించి మెప్పించారు . ఇప్పుడు వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి కూడా అలాగే చేయబోతున్నారట . నిజానికి వీళ్ళ పెళ్లైన మూమెంట్లోనే వీళ్ళ కాంబోలో సినిమా రాబోతుంది అని అంతా మాట్లాడుకున్నారు . ఇన్నాళ్ళకి ఆ గుడ్ న్యూస్ వినిపిస్తున్నారా..? అంటూ మెగా ఫ్యాన్స్ కూడా ఫుల్ ఎక్సైట్ మెంట్ తో ధ్రిల్ అయిపోతున్నారు . అందుతున్న సమాచారం ప్రకారం డైరెక్టర్ శివ నిర్వాణ .. వీళ్ళిద్దరిని పెట్టి హీరో హీరోయిన్లుగా మూవీని తెరకెక్కించబోతున్నారట . ఆశ్చర్యం ఏంటంటే గతంలో నాగచైతన్య - సమంతలను కూడా ఈయనే హీరో హీరోయిన్లుగా పెట్టి సినిమాను  తెరకెక్కించారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: