ఒకప్పుడు హీరోగా దాదాపు 90 కి పైగా సినిమాల్లో నటించిన శివాజీ బిగ్ బాస్ కి రావడంతో ఆయన జాతకం మారిపోయింది. బిగ్ బాస్ తర్వాత శివాజీకి వరుస ఆఫర్స్ వచ్చాయి. బిగ్ బాస్ కి ముందే ఈయన ఓ వెబ్ సిరీస్ చేశారు.కానీ బిగ్ బాస్ అయిపోయాక ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయింది.వెబ్ సిరీస్ ద్వారా శివాజీ మళ్లీ లైమ్ లైట్ ల కి వచ్చేసారు. ఇక తాజాగా రిలీజ్ అయిన కోర్టు మూవీ మాత్రం శివాజీ దశ మార్చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాజాగా నాని నిర్మాతగా విడుదలైన కోర్టు మూవీ లో మంగపతి అనే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో శివాజీ నటించారు. ఈ మూవీలో హీరోయిన్ జాబిలి తల్లి పాత్రలో రోహిణి నటించింది.రోహిణి సోదరుడి పాత్రలో శివాజీ నటించారు. 

అంటే హీరోయిన్ మేనమామ పాత్రలో శివాజీ నటించారు.అయితే ఈ సినిమాలో హీరోయిన్ కుటుంబం పై మంగపతి అజమాయిషి చెలాయిస్తూ ఉంటారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి చనిపోయినట్టు చూపిస్తారు. ఇక తండ్రి పాత్రలో శ్రీహరి ఫోటోని తీసుకున్నారు. దాంతో ఈ సినిమాలో ఓ సన్నివేశంలో హీరోయిన్ నాన్నే బతుకుంటే ఇదంతా అయ్యేదా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయితే ప్రస్తుతం శివాజీకి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో ట్రోల్ అవుతుంది. అదేంటంటే మంచు విష్ణు గతంలో మా ఎలక్షన్ సమయంలో శ్రీహరి అంకుల్ బతికి ఉంటే ఇదంతా జరిగేది కాదు. 

యన మీకు తగినట్లు గుణపాఠం చెప్పేవాడు.ఆన్సర్ ఇవ్వడానికి ఆయనే మీకు కరెక్ట్ మొగుడు అన్నట్లుగా మంచు విష్ణు మాట్లాడారు. అయితే మంచు విష్ణు మాట్లాడింది శివాజీని ఉద్దేశించి కాదు. గతంలో మా ఎలక్షన్స్ సమయంలో రాజశేఖర్ జీవితలను ఉద్దేశించి మాట్లాడారు. కానీ అప్పుడు మంచు విష్ణు  మాట్లాడిన ఈ మాటలను శివాజీ క్యారెక్టర్ కి సింక్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోని వైరల్ చేస్తున్నారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: