
వారందరి తరపున బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్ జే శేఖర్ బాషా రంగంలోకి దిగారు .. వారికి సమయం కావాలని పోలీసులను కోరారు దీంతో వాళ్లకు మూడు రోజుల సమయం ఇచ్చింది .. ఇదే సమయంలో వారందరికీ షాక్‌స్తూ నిన్న రాత్రి విచారణకు హాజరయ్యారు టేస్టీ తేజ . అయితే విష్ణుప్రియ మాత్రం విచారణకు వచ్చేందుకు మూడు రోజుల సమయానికి వస్తానన్నట్లు ఫిక్స్ అయింది . ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి విష్ణు ప్రియా , టేస్టీ తేజాతో పాటు సుప్రీత, రీతూ చౌదరి, హర్షసాయి, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, కానిస్టేబుల్ కిరణ్‌గౌడ్, బయ్యా సన్నీ యాదవ్, లోకల్‌బాయ్ నాని, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, శ్యామల పై కేసులు నమోదయ్యాయి . నోటుసులు ఇచ్చిన వారిలో కొందరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడంతో వాళ్లకోసం పోలీసులు వేట మొదలుపెట్టారు . ఇక పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ ను త్వరలోనే అరెస్టు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా ఇమ్రాన్ వీడియోలు ఎంతో జుగుప్సాకరంగా ఉన్నాయి అంటూ పోలీసులు చెబుతున్నారు .. పోలీస్ డ్రెస్ వేసుకొని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కానిస్టేబుల్ కిరణ్ గౌడ పైన కూడా కేసు పెట్టారు.
ఇప్పటికే లోకల్ బాయ్ నాని అరెస్టవుగా .. భయ్యా సన్నీ యాదవ్ ఎవరికి కనిపించకుండా పరారీ అయినట్టు తెలుస్తుంది . ఇందులో మరికొందరి పరిస్థితి చేతులు కలక ఆకులు పట్టుకున్నట్లుగా మారింది . అప్పుడు డబ్బులు కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసాం .. ఇప్పుడు వాటిని మానేశామని చెబుతున్నారు .. ఏదేమైనా కూడా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారిని వదిలే పరిస్థితి లేదంటున్నారు పోలీసులు .. మొత్తంగా బెట్టింగ్ యఫ్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీ లందరికీ ఉచ్చు బిగిస్తుంది .. ఈ వ్యవహారంలో పోలీసులతో పాటు ఈడి కూడా రంగంలోకి దిగుతుందని కూడా అంటున్నారు . ఈ బెట్టింగ్ యఫ్ ప్రమోషన్ పై దర్యాప్తు ఇప్పటికే ముమ్మరం చేశారు పోలీసులు .. ఇప్పటికే 11 మంది ఇన్‌ఫ్లూయెన్సర్లకు నోటీసులు కూడా జారీ చేశారు . అయితే వీరిలో పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ , హర్ష సాయి ఎక్కడికో పారిపోయినట్లు తెలుస్తుంది .. బెట్టింగ్ యఫ్ ప్రమోషన్ చేస్తున్న వారి నుంచి ఆ నిర్వహకుల ఆధారాలు కూడా సేకరిస్తున్నారు పోలీసులు . వీరిపై మరింత ఉచ్చు బిగించేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు.