
అటు నటిస్తాడు , నిర్మిస్తాడు , విజువల్ ఎఫెక్ట్స్ లో ప్రవేశం ఉంది .. క్యాస్టింగ్ కంపెనీ ఉంది ,హోస్టింగ్ చేస్తాడు , డిస్ట్రిబ్యూట్ చేస్తాడు , బిజినెస్ లోఆరితేరిపోయాడు ఇలా అన్నిటిలో తన మార్క్ చూపించుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు . నటన కంటే ఎక్కువగా ఈ రీసెంట్ టైమ్స్ లో వ్యాపారాల వైపు అడుగులు పెడుతున్నాడు రానా . లీడర్ నుంచి రజినీకాంత్ తో వేట్టయాన్ వరకు ఎక్కడ ఇమేజ్ చక్రంలో ఇరుకోలేదు రానా . నటనతో పాటు తనప్రొడక్షన్ లోనూ బిజీగానే ఉన్నారు .. కేరాఫ్ కంచరపాలెం , 777 చార్లీ , 35 లాంటి సినిమాలను విడుదల చేసింది కూడా ఈ హీరోనే ..
ఇలా మరోవైపు రానా నాయుడు లాంటి వెబ్ సిరీస్ లు , నెంబర్ వన్ యారి , ది రానా దగ్గుబాటి లాంటి టాక్ షోలతో కూడా డిజిటల్ మీడియాలోనూ రెఫ్ఫాడించాడు . ఇలా గత కొన్ని సంవత్సరాలుగా నటనకు గ్యాప్ ఇస్తూ వస్తున్న రానా . ఈ విషయం పై అడిగితే మంచి కథ వస్తే చేస్తా కంగారేం లేదంటున్నాడు .. ఇప్పుడు తాజాగా తన భార్య మిహీకతో కలిసి ఫుల్ స్టోరీస్ పేరుతో ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టాడు ఈ దగ్గుబాటి హీరో .. ఇలా మొత్తానికి ఎక్కడ చూసినా అక్కడ తన హ్యాండ్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు .. అందుకే టాలీవుడ్ లో రానాని మాత్రం టు ఆల్ రౌండర్ అంటున్నారు.